ఆ విషయంలో బాబు పిచ్చ హ్యాపీ

September 03, 2015 | 03:40 PM | 3 Views
ప్రింట్ కామెంట్
chandrababu-smile-in-AP-assembly-niharonline.jpg

ఏపీ సీఎం చంద్రబాబు ప్రస్తుతం తెగ హ్యాపీ గా ఉన్నారు. ఇప్పుడు ముఖ్యమంత్రి పదవిలో ఉన్నప్పటికీ, అప్పట్లో ప్రతిపక్షనేతగా ఉన్న టైంలోనూ ఆయన ఎప్పుడూ ఏదో ఆలోచించుకుంటూ ఉండేవారు. పార్టీని అధికారంలోకి తెచ్చాక కూడా ఇది మరింత ఎక్కువయ్యిందనే చెప్పాలి. అధికారుల సహకారం లేకపోవటం, దానికి తోడు బ్యాడ్ టైం నడుస్తుండటంతో ఆయన ముఖంలో నవ్వు మటుమాయమయ్యిందనే చెప్పాలి. అది దాదాపు ఓ పదేళ్లుగా... ప్రతిపక్ష నేతగా ఉన్న టైంలో టీడీపీని అధికారంలోకి తేవటం, పార్టీని పటిష్టపరుచుకోవటం లాంటి అంశాలపైనే దృష్టిసారించడంతో ఎప్పుడూ టెన్షన్ టెన్షన్ గా కనిపించేవారు. ఇక ప్రచార సమయంలోనూ అంతే...  మిగిలిన నేతలకూ.. బాబుకు అదే తేడా. ఇక వైఎస్ సైతం చంద్రబాబును నవ్వు విషయంలోనే చాలా సార్లు విసిగించారు కూడా. కానీ ప్రస్తుత సమావేశాల్లో ఆయన ముఖంలో చిరునవ్వు కనిపిస్తుంది. సాధారణంగా సమావేశాలంటే చాలు... విపరీతమైన బీపీ,  అరవటం.. బాధతో. . వేదనతో వ్యాఖ్యలు చేయటం లాంటివి కనిపిస్తుంటాయి.

అలాంటిది తాజా ఏపీ అసెంబ్లీ సమావేశాలు చూసిన ప్రతిఒక్కరూ ఒక్క విషయాన్ని చాలా స్పష్టంగా గమనించాలి. అదే బాబు ముఖంలో నవ్వు. పలు సందర్భాల్లో విపక్షంపై విరుచుకుపడి.. ఆ తర్వాత నవ్వుతూ మాట్లాడటం కనిపిస్తుంది. ఎందుకలా అని ఆరాతీస్తే అసలు కథ బోధపడుతుంది. కారణం ప్రతిపక్షాల తడబాటు... బలమైన కౌంటర్ ఇచ్చే వారు వైసీపీ నుంచి లేకపోవటమే ఆయన సంతోషానికి అసలు కారణంగా చెప్పాలి. జగన్, రోజా ఇలా ఒకరిద్దరు తప్ప మిగతా వారెవ్వరూ విమర్శలు చేయకపోవటం, వారిద్దరు ముగ్గురు చేసే వాటికి మంత్రులు బలమైన కౌంటర్ ఇవ్వటంతో బాబు తెగ సంతోషంతో ఉన్నారు.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ