ఆ ఒక్కడు ... తన ఉద్రేక ప్రసంగాలతో పటేళ్లంతా ఉద్యమబాట పట్టేలా చేశాడు. పటేళ్లను బీసీల్లో చేర్చాలంటూ ఆందోళన చేపట్టి గుజరాత్ ప్రభుత్వానికి నిద్రలేకుండా చేస్తున్నాడు. ఆ యువకుడి ఉద్యమ ప్రభావం ఎలా ఉందంటే ఆఖరికి ప్రధాని నరేంద్ర మోదీ సైతం ఆ ఇష్యూపై స్పందించాల్సి వచ్చింది. హార్దిక్ పటేల్ దేశ వ్యాప్తంగా వినిపిస్తున్న పేరు. లక్షల మంది జనం అతగాడి ఉపన్యాసం వినేందుకు క్యూ కట్టారు.
కానీ ఇప్పుడు షాకింగ్ గురయ్యే ఓ వీడియో వాట్సప్ తదితర సోషల్ మీడియాల్లో హల్ చల్ చేస్తూ అలజడి రేపుతోంది. హర్ధిక్ పటేల్ పోలికలున్న ఓ వ్యక్తి నలుగురితో కలిసి ఓ హోటల్ లో ఓ థాయ్ మహిళతో రాసలీలలు జరిపినట్లుగా ఆ వీడియో ఉంది. నిజానికి ఈ వీడియో నిజానికి నాలుగు రోజుల ముందే ఇంటర్నెట్ లో దర్శనమిచ్చింది. అయితే ఆ వీడియోలో ఉంది హార్థిక్ పటేల్ అవునా కాదా అన్నదే ఇప్పుడు తేలాల్సింది.
ఉద్యమాన్ని అణచివేసేందుకే మార్ఫింగ్ చేసిన వీడియోను పెట్టారని పటేల్ సంఘాలు ఆరోపిస్తున్నాయి. హార్దిక్ ను ఇబ్బందుల్లోకి నెట్టేందుకు ఇలాంటి వీడియోను రూపొందించి ఉంటారన్న ఊహాగానాలు ఒకపక్క సాగుతుంటే.. మరోవైపు హర్థిక్ తన స్నేహితులతో కలిసి థాయ్ వెళ్లి ఈ పని చేశాడని మరి కొందరు అంటున్నారు. మీడియాలో హాల్ చల్ చేస్తున్నా ఈ వీడియోపై హర్థిక్ స్పందించకపోవటంతో నిజమనే అనుకోవాలని ఇంకోందరు అంటున్నారు. దీనిపై హర్థిక్ పెదవి విప్పాలని అతని సన్నిహిత వర్గాలు కూడా కొరుతున్నారట.