16 కిలోమీటర్లు సైకిల్ తొక్కి షాకిచ్చాడు

February 24, 2016 | 01:00 PM | 2 Views
ప్రింట్ కామెంట్
balakrishna-16km-cycle-ride-for-lepakshi-niharonline

సినీ రంగం వేరు, రాజకీయ రంగం వేరు అని చెప్పేవారికి చెంపపెట్టులా తన చేతలతో సమాధానం చూపిస్తున్నాడు నటసింహ బాలకృష్ణ. హిందూపురం ఎమ్మెల్యేగా తన నియోజకవర్గ పనులను చక్కబెట్టడంతోపాటు, ఏపీ పొలిటిక్స్ లో ఇప్పుడు బాలయ్యే కీలకపాత్ర. ఆయా సంబంధిత మంత్రులతో ఎప్పుడూ టచ్ లో ఉంటూ అనంతపురం జిల్లాను సస్యశామలంగా తీర్చి దిద్దేందుకు అహర్నిశలు శ్రమిస్తున్నాడు. ఇప్పుడు ప్రతిష్టాత్మకంగా తీసుకున్న లేపాక్షి ఉత్సవాలను విజయవంతం చేయాలని ప్రయత్నిస్తున్నాడు.

            ఇందులో భాగంగా బుధవారం  ఆయన ఆధ్వర్యంలో సైకిల్ ర్యాలీ నిర్వహించారు. ముందుగా  ర్యాలీని బాలయ్య జెండా వూపి ప్రారంభించారు. చిలమత్తూరు మండలం కొరికొండ చెక్ పోస్టు నుంచి లేపాక్షి నంది విగ్రహం వరకు సైకిల్ ర్యాలీ కొనసాగింది. ఈ సమయంలో లేపాక్షి యువతతో కలసి బాలయ్య కూడా ఉత్సాహంగా సైకిల్ తొక్కారు. 16 కిలో మీటర్లు సైకిల్ తొక్కి 40 నిమిషాల్లో లేపాక్షి చేరుకున్నారు. దాంతో అక్కడివారంతా ఆశ్చర్యపోయారు. మొత్తానికి పార్టీ గుర్తును హైలెట్ చేస్తూ అంత దూరం సైకిల్ తొక్కడమంటే మాటలేం కాదుకదా. బాలయ్య నువ్వు సూపరయ్యా.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ