బిసీ సంఘం జాతీయ అధ్యక్షుడైన ఆర్. కృష్ణయ్య ఘాటుగా తమ నాయకులను రెచ్చగొట్టే వ్యాఖ్యాలు సంధించారు. పార్లమెంట్‌లో బీసీల సమస్యలను ప్రస్తావించని బీసీ ఎంపీలను రాళ్లతో కొట్టిస్తామని టీడీపీ ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్య హెచ్చరించారు. తమ వర్గాన్ని అణిచి వేసేలా ప్రభుత్వాలు తమ పాలనను కొనసాగిస్తున్నాయని ఆయన అభిప్రాయ పడ్డాడు. దీంతో జరుగుతున్న అన్యాయాన్ని ఎదిరించేందుకు బీసీలంతా తీవ్రవాదులుగానో, ఉగ్రవాదులుగానో మారుతారని చెప్పారు. మెదక్ జిల్లా కేంద్రమైన సంగారెడ్డిలో శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. తెలంగాణ, ఆంధ్రా ప్రభుత్వాలు బీసీ వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్నాయని, సమస్యలపై ఇద్దరు సీఎంలను నిలదీస్తామని చెప్పారు. లక్ష ఉద్యోగాలు ఇస్తామని ఎన్నికల ముందు హామీ ఇచ్చిన కేసీఆర్ ఏ ఒక్కరికీ కూడా ఉద్యోగం ఇవ్వలేదని విమర్శించారు.