అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో తలమునకలై ఉన్న ఆ ఇద్దరు ఇప్పుడు ఇలా సేదతీరారు. భారమంతా ప్రజలపైన వేసి ఎవరి పనుల్లో వారు నిమగ్నమయ్యారు. ఒక తంతు ముగిసిపోవటంతో ఒత్తిడి నుంచి కొలుకునేందుకు ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ యోగాను ఎంచుకోగా, బీజేపీ అభ్యర్థి కిరణ్ బేడీ భక్తి మార్గాన్ని ఎన్నుకున్నారు. క్రుష్ణా నగర్ లోని గురుద్వార్ లో స్వయంగా ఆమె రోట్టెలు చేసి భక్తులకు పంచిపెట్టారు. తాను ఈ పని చేయటం ఇదే మొదటిసారి కాదని, కుటుంబం నుంచి అలవాటయ్యిందని ఆమె చెప్పారు. నేను అన్ని మతాలను, దైవాలను నమ్ముతాను. అందుకే ఇప్పుడు దైవ సన్నిధికి చేరాను అని ఆమె మీడియాతో అన్నారు. మొత్తానికి హడావుడి ముగిసి ఎవరి పనుల్లో వారు మునిగారు. మరీ వారి భవిష్యత్ ఏంటో ప్రజలు శనివారం తేల్చబోతున్నారు. వెయిట్ అండ్ సీ...