మందుబాబులకు మాంఝీ మాంచి సలహా

October 15, 2015 | 12:39 PM | 2 Views
ప్రింట్ కామెంట్
manjhi-voters-First-vote-then-booze-niharonline

వాడి వేడిగా దేశంలో ప్రస్తుతం నడుస్తున్న టాపిక్ ఏంటంటే... బీహార్ ఎన్నికలు. దేశంలో బీజేపీ భవితవ్యంతోపాటు, మోదీ మార్క్ పై ప్రభావం చూపేవిధంగా ఉండబోతున్నాయనటంలో ఎలాంటి సందేహం లేదు. అయితే మొదటి దశ ముగిసిన అనంతరం జనతాపరివార్ కూటమికి ఓటమి భయం పట్టుకుంది. ఎస్పీ అధినేత ములాయం సింగ్ నితీశ్ మోసం చేశాడంటూ మీడియా ముందు ఫైరయ్యాడు. తమ పార్టీ ఇక బీహార్ నుంచి నిష్క్రమించినట్లే అని ప్రకటించాడు కూడా. ఇది మహకూటమికి పెద్ద దెబ్బే. ఇక ఇదే అదనుగా భావించిన ప్రత్యర్థులు వారిపై విరుచుకుపడుతున్నారు. ఈ నేపథ్యంలోనే బీహార్ మాజీ ముఖ్యమంత్రి జితన్ రామ్ మాంఝీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

ఓటర్లకు ఎర వేసేందుకు పలు పార్టీల నేతలు ఓటర్లకు మద్యం సరఫరా చేస్తున్నారు. పచ్చిగా చెప్పాలంటే అక్కడ మద్యం ఏరులై పారుతోంది. ఈ క్రమంలో మాంఝీ మందుబాబులకు మాంచి సలహా ఇస్తున్నాడు. నేతలు ఇచ్చే మందు తీసుకోవద్దని నేను అనను. తీసుకోండి. కాకపోతే ముందు ఓటు వెయ్యండి. ఆ తర్వాత తాగండి అంటూ సూచించారు. మాంఝీ ఈ మాట చెప్పడానికి పెద్ద కారణమే ఉంది.

మద్యం మత్తులో పడిపోయిన పలువురు ఓటర్లు, అసలు పోలింగ్ కేంద్రానికే రావడం లేదట. ఈ నేపథ్యంలోనే ఆయన 'పెహలే మత్ దాన్, ఫిర్ మద్యపాన్' అనే నినాదాన్ని ఇచ్చారట. అధికారంలోకి వచ్చాక మద్యం విధానాన్ని సమూలంగా మార్చేద్దామని ఉన్న బీజేపీకి ఈ వ్యాఖ్యలు కాస్త కంగారు పెట్టేలా ఉన్నాయ్ మరి.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ