రాష్ట్రాన్ని విడగొట్టే సందర్భంలో తీసుకోవాల్సిన తగు జాగ్రత్తలు కనీసమైనవి పాటించకుండా ఏవిధమైన కసరత్తు, పరిశ్రమ చేయకుండా, ముందు చూపు లేకుండా, గుడ్డిగా తంతు నడిపి మమ అనిపించింది కేంద్రంలోని గత ప్రభుత్వం. ఆ గుంపులో డిగ్గీరాజా అనే గోవిందయ్య ఒకడున్నాడు. రాష్ట్రంలో ప్రతిపక్ష నాయకుడు చేసే నిరవధిక అభోజన దీక్షకు తాను మద్ధతిస్తానని డిగ్గీ ప్రకటించేడు. మనకు నిరాహార దీక్షలు తెలియని కావు. యాభైరోజులపైగా పొట్టిశ్రీరాములు చేసినప్పుడు ఇలాంటి గోవిందయ్యల మద్దతు ఆశించలేదు. దీక్ష ఆరంభమైన నాలుగైదు రోజుల నుంచే మమ్మల్ని వచ్చి పరామర్శించడం లేదు, కేంద్ర, రాష్ట్రాలు స్పందించడంలేదు అని గగ్గోలు పెట్టడం, నాలుగైదు రోజులకే ప్రత్యేక హోదా అర్జెంటుగా ప్రకటించడంలేదని బావురుమనడం అంతా తమాషాగా ఉంది. రోజుల తరబడి పస్తులుండటం ఉన్నా, వారి శరీరధర్మం సరిగా నిర్వర్తించకపోవడంలాంటివి పేపర్లో గతంలో అంతగా కంగారుపెట్టేవారు కాదు.
తిండి తినకపోతే కీటోన్ బాడీస్ గతి తప్పుతాయనే సామాన్యులకు తెలియని వైద్యపరిభాషతో ఊదరగొట్టడం జరుగుతోంది. ఈ అస్తవ్యస్థ దుర్మార్గపు పరిణామాలకు ఆద్యులైన కాంగ్రెసు గోవిందయ్యలకు ఎన్నికల్లో ప్రజలు ఛీ అన్నప్పటికీ ఈ మధ్య నుంచే గొంతులేస్తున్నది. గతం మరుగునపడిందనే చిత్త భ్రమతో ఆంధ్ర ఇన్ ఛార్జి అయిన డిగ్గీ, చంద్రబాబునీ, మోదీనీ నిందిస్తూ ప్రజలను పిచ్చోళ్లని చేస్తున్నారని అంటున్నాడు. పనిలోపనిగా కేసీఆర్ ని కూడ వదల్లేదు. విడిపోయిన తర్వాత సోనియా తో గ్రూపు ఫోటో తీయించుకుని నవ్వుకుంటూ బయటకొచ్చి వికటాట్ట హాసం చేసుకుంటూ కులాసాగా తిరుగు ప్రయాణమైన కేసీఆర్ చాణక్యం ముందు తామందరూ పనికిరాకుండా పోయామనే దుఖం డిగ్గీరాజాది. ఇప్పుడు ఇటువంటి పిల్లదీక్షలకి ఇప్పుడు మద్దతు పలకడం, కొంపకి నిప్పెట్టి ఫైరింజన్ కి ఫోన్ చెయ్యటం లాంటిదే!