దేవుడికీ చుక్కలు చూపిస్తున్న సీఎం

April 07, 2016 | 05:39 PM | 2 Views
ప్రింట్ కామెంట్
bihar-local-gods-liquor-ban-effect-niharonline

ఆదాయం గణనీయంగా పడిపోతుందని తెలిసినా కూడా బీహార్లో మద్యపాన నిషేధం అమలు చేయించారు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నితీశ్ కుమార్. ముందుగా సమయం ఇచ్చినప్పటికీ ఏప్రిల్ 1 నుంచే అక్కడ బ్యాన్ అమలులోకి వచ్చింది.  దీంతో, మందుబాబులంతా పిచ్చివాళ్లుగా మారి పోతున్నారు. అయితే ఇది ముందుగానే ఊహించిందని ప్రస్తుతం విరుగుడు ఇంజక్షన్లతో పనికానిస్తున్నప్పటికీ, త్వరలో వారు మాములు స్థితికి వచ్చే అవకాశం ఉందని వైద్యులు చెబుతున్నారు. ఇక మద్యపాన నిషేధంతో ఒక్క మనుషులే కాదు, అక్కడి దేవుళ్లు కూడా ఇబ్బంది పడుతున్నారు. అదేమిటి! దేవుళ్లు ఇబ్బంది పడటమంటారా!

                         అక్కడికే వస్తున్నాం... బీహార్ లోని దళితులు, మహా దళితులు పూజించే దాక్ బాబా, మసాన్ బాబా, గొరైయ బాబా, దిహ్వాల్ బాబా, నౌఖా బాబా, భైరవ్ తదితర దేవుళ్లకు నైవేద్యంగా మద్యం సమర్పిస్తారు. మద్యం నిషేధించడంతో ఆ దేవుళ్లకు ‘మద్యం’ నైవేద్యం ఆగిపోయింది. దీంతో, గయలోని పలు ప్రముఖ ఆలయాలకు భక్తులు రాకపోతుండటంతో పూజారులు దిక్కులు చూడాల్సి వస్తోంది. ఈ సందర్భంగా గోదావరి మోహల్లా భైరవ స్థాన్ ఆలయ పూజారి అనంత్ మరాథే మాట్లాడుతూ, తమ దేవుడు కపాల్ బైరవ మద్యాన్ని మాత్రమే నైవేద్యంగా స్వీకరిస్తారని, ప్రస్తుత పరిస్థితుల కారణంగా నైవేద్యం సమర్పించలేక పోతున్నామని, అది సాధ్యం కాకపోవడంతో భక్తులు ఆలయాలకు రావడం లేదని వాపోతున్నారు.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ