తాజా పరిణామాలు నరేంద్రమోదీ ప్రభుత్వానికి ఇబ్బంది కలిగించేలా పరిణమిస్తున్నాయనటంలో ఎలాంటి సందేహం లేదు. భూసేకరణ బిల్లుపై కేంద్రప్రభుత్వం ప్రతిపాదించిన సవరణలను విపక్షాలన్నీ ఎండగడుతున్న సంగతి తెలిసిందే. విపక్షాలను దీటుగా ఎదుర్కొంటున్న మోదీ సర్కారుకు ఇప్పుడు కొత్త సమస్య తలెత్తింది. ఆర్ఎస్ఎస్ అనుబంధ సంస్థల్లో ఒకటైన స్వదేశీ జాగరణ్ మంచ్ కూడా ఈ సవరణలను వ్యతిరేకిస్తోంది. అంతేకాదు ఏకంగా ఢిల్లీ లోని జంతర్ మంతర్ వద్ద నిరసన ప్రదర్శనకు కూడా దిగుతోంది. ఒకవేళ భూసేకరణ బిల్లును ఆమోదిస్తే, దేశ వ్యాప్తంగా ప్రదర్శనలు వెలువెత్తుతాయని మంచ్ నేత గోవిందాచార్య హెచ్చరించారు. మోదీ తీసుకున్న ఈ నిర్ణయం ప్రజా వ్యతిరేకమని ఆయన అంటున్నారు. మరి సొంత సంస్థ నుంచే వ్యతిరేకత వస్తుండటంతో మోదీ సర్కార్ కు ఇరకాటంలో పడినట్టైంది. మరి వీటిని మోదీ ఎలా సమర్థవంతంగా ఎదుర్కుంటారో వేచిచూడాలి.