ఆమ్ ఆద్మీ పార్టీ నేత కుమార్ విశ్వాస్ పై బీజేపీ పోలీసులకు ఫిర్యాదుచేసింది. ఎన్నికల ప్రచారంలో భాగంగా తమ పార్టీ సీఎం అభ్యర్థి అయిన కిరణ్ బేడీపై విశ్వాస్ లైంగికపరమైన వ్యాఖ్యలు చేశాడు. ఆ సమయంలో పార్టీ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ కూడా ఉన్నారు. అంతేకాదు ఈ వ్యవహారాన్ని ఈ సీ ద్రుష్టికి తీసుకెళ్లాలని బీజేపీ భావిస్తోంది. కాగా, ఈ వ్యాఖ్యలపై కుమార్ విశ్వాస్ వివరణ ఇచ్చుకున్నాడు. తనకు కిరణ్ బేడీ అంటే ఎంతో గౌరవమని, ఇలాంటి చౌకబారు వ్యాఖ్యలు తానెప్పుడూ చేయబోనని చెప్పారు. కావాలంటే వీడియో ఫుటేజ్ లను పరిశీలించాలని, ఒకవేళ అది నిజమని తేలితే శాశ్వతంగా రాజకీయాలకు దురమౌతానని చెప్పుకొచ్చారు. ఇక తనపై చేసిన వ్యాఖ్యలపై కిరణ్ బేడీ ఓ రేంజ్ లో విరుచుకుపడ్డారు. ఇలాంటి ఆలోచన ఉన్న ఆప్ అధినాయకత్వం నుంచి మహిళలు ఎటువంటి రక్షణ, గౌరవం కోరుకుంటారని ఆమె ట్విట్టర్లో పేర్కొన్నారు.