పశ్చాతాపం కోసమే ఆ పాదయాత్ర: బీజేపీ సెటైర్

April 30, 2015 | 04:10 PM | 21 Views
ప్రింట్ కామెంట్
sambit_patra_satires_on_rahul_gandhi_kisan_yathra_niharonline

యువరాజు నడుం బిగించి రైతుల కోసమంటూ ఇలా పాదయాత్ర ప్రారంభిచాడో లేదో అధికార పక్షం బీజేపీ విమర్శలు స్టార్ట్ చేసింది. రాహుల్ గాంధీ చేసేది కిసాన్ యాత్ర కాదని అది పశ్చాత్తాప యాత్ర అని ఎద్దేవా చేసింది. ఈ యాత్రకు రాహుల్ పశ్చాత్తాప యాత్ర అని పేరు పెట్టుకోవాలని, మహారాష్ట్రలో కాంగ్రెస్ పాలన సాగిన సమయంలో ఆయా పథకాలు అమలు చేయనందుకు ఈ సందర్బంగా పశ్చాత్తాప పడాలని బీజేపీ అధికార ప్రతినిధి సంబిత్ పట్రా పేర్కొన్నారు. నేషనల్ బ్యూరో ఆప్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (ఎన్సీఆర్బీ) నివేదికల ప్రకారం... కాంగ్రెస్, ఎన్సీపీ హయాంలోనే అత్యధిక సంఖ్యలో బలవన్మరణాలు చోటుచేసుకున్నాయని పట్రా వివరించారు. మోదీ సర్కార్ రైతు అనుకూల పథకాలతో ముందుకు పోతోందని కొనియాడారు. ఏదేమైనా... 56 రోజులు మనిషి కనపడకుండా ఎక్కడికి పోయాడో తెలీదు కానీ, రీఎంట్రీ తో మాత్రం రాహుల్ బీజేపీకి ముచ్చెమటలు మాత్రం పోయిస్తున్నాడని కాంగ్రెస్ సీనియర్ నేతలు తెగ సంబరపడిపోతున్నారు.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ