ఛీ..ఛీ... కార్పొరేటర్లా? కామాంధులా?

May 14, 2016 | 11:37 AM | 8 Views
ప్రింట్ కామెంట్
vijayawada-corporator-misbehave-in-flight-niharonline

తెలుగుదేశం తమ్ముళ్లకు టైం అస్సలు బాగోలేదు. తప్పు చేస్తూ స్పాట్ లోనే బుక్కయిపోతున్నారు. గతవారం పుణే రైల్వే స్టేషన్ లో పుల్లుగా తాగి నలుగురు విజయవాడ కార్పొరేటర్లు ఓ మహిళతో అసభ్యంగా ప్రవర్తించి పోలీసులకు అడ్డంగా దొరికిపోయిన సంగతి తెలిసిందే. తాము అధికార పార్టీ సభ్యులమని చెప్పినా వినకుండా పోలీసులు వారి పని వారు చేసుకుపోయారు. కట్ చేస్తే మరో విజయవాడ కార్పొరేటర్ పై సరిగ్గా ఇలాంటి ఆరోపణలే వస్తున్నాయి.

                                  ఉమ్మడి వెంకటేశ్వరరావు అలియాస్ చంటిబాబు ఢిల్లీ నుంచి హైదరాబాద్ వస్తున్న ఓ విమానంలో ప్రయాణికురాలిని వేధించాడన్న ఆరోపణలపై కేసు నమోదైంది. ఈ విషయాన్ని మహిళ శంషాబాద్ ఎయిర్ పోర్టులో ఫిర్యాదు చేయగా, అప్పటికే చంటిబాబు గన్నవరానికి బయలుదేరి వెళ్లిపోయారు. దీంతో విషయాన్ని గన్నవరం ఎయిర్ పోర్టు పోలీసులకు శంషాబాద్ పోలీసులు చేరవేయగా, చంటిబాబు తప్పించుకుని పరారైనట్టు తెలుస్తోంది. విమానం ల్యాండింగ్ కన్నా ముందుగానే గన్నవరం పోలీసులకు సమాచారం అందినప్పటికీ, రాజకీయ ఒత్తిళ్ల కారణంగా ఆయన్ను వదిలేసినట్టు విమర్శలు వస్తున్నాయి. తెలుగు గౌరవాన్ని ఖండాంతరాలకు వ్యాపింపజేశామని చెప్పుకొనే టీడీపీకి, సొంత పార్టీ కార్పొరేటర్ల కామ చర్యలతో తెగ ఇబ్బందులు వచ్చిపడుతున్నాయి.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ