ఓటుకు నోటులో చిక్కుముడి వీడిందా?

August 18, 2015 | 11:27 AM | 5 Views
ప్రింట్ కామెంట్
cash_for_vote_scam_cash_mystery_revanth_reddy_niharonline

తెలుగు రాష్ట్రాల మధ్య తెగని వివాదంగా తయారయ్యింది ఓటుకు నోటు వ్యవహారం. టీ ప్రభుత్వం మాట పక్కన పెడితే ఏసీబీ అధికారులు మాత్రం తమ పని తాము చేసుకుంటూ పోతున్నారు. ఎవరీని వదలకుండా విచారణ కానిచ్చేస్తున్నారు. బడా నేతల దగ్గరి నుంచి ఆఖరికి ఏపీ సీఎం చంద్రబాబు తనయుడు లోకేష్ కారు డ్రైవర్ వరకు అందరినీ విచారించేశారు.  ఓటుకు నోటు ఇష్యూలో బాబును బుక్ చేసే విషయంలో కూడా ఏసీబీ అధికారులు మాత్రం చాలా వరకు సక్సెస్ అవుతున్నారనే చెప్పొచ్చు. ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావటంతో పక్కా ఆధారాలతో ఇరికించేందుకు ప్రణాళిక సిద్దం చేశారు. ఈ నేపథ్యంలోనే చార్జిషీట్ లో 22 చోట్ల ఆయన పేరును ప్రస్తావించారు. నేరంలో ఆయన ఉన్నారని నేరుగా చెప్పకుండా పరోక్షంగా ఆయన పేరును ప్రస్తావించారు. ఇన్ని జరుగుతున్న ఈ వ్యవహారంలో ఒక్క విషయంలో మాత్రం తెలంగాణ ఏసీబీ అధికారులు విఫలమవుతూ వస్తున్నారు.  అసలు ఈ వ్యవహారంలో కీలకమైన రూ.50 లక్షల సొమ్ము ఎక్కడి నుంచి వచ్చిందో అధికారులు ఇంతవరకు తేల్చలేకపోయారు. నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్ సన్ కు బ్యాగులో ఆఫర్ చేసిన రూ.50 లక్షలకు సంబంధించిన మొత్తం ఎవరు సమకూర్చారన్న దానిపై ఈ కేసు ఎంతోకొంత ప్రభావం చూపించటం ఖాయం. ఈ నేపథ్యంలో రూ.50లక్షలు ఇచ్చింది ఎవరనే దానిపై బుర్ర బద్ధలు కొట్టుకున్నా ఫలితం లేకపోయింది.

                         ఎట్టకేలకు ఈ వ్యవహారంలో చిక్కుముడి వీడినట్లుగా సమాచారం అందుతోంది. ఈ సస్పెన్స్  కు తెర దించుతూ.. చివరకు రూ.50 లక్షల మొత్తానికి సంబంధించి ఆధారాలు సేకరించినట్లుగా చెబుతున్నారు. ఈ మొత్తాన్ని కర్ణాటక రాజధాని బెంగళూరు నుంచి సమకూర్చినట్లుగా చెబుతున్నారు. ఈ మొత్తాన్ని మాజీ ఎంపీ.. దివంగత పారిశ్రామికవేత్త ఆదికేశవుల నాయుడు కుమారుడు శ్రీనివాసనాయుడు సమకూర్చి ఉంటారని భావిస్తున్నారు. ధీనికి సంబంధించిన ఆధారాల్ని తాము సేకరించినట్లుగా తెలంగాణ ఏసీబీ అధికారులు చెబుతున్నారు. తాజాగా డీకే శ్రీనివాస్ (దింగత ఆదికేశవనాయుడి కుమారుడు.. కర్ణాటక బేవరేజస్ అండ్ డిస్టలరీస్ ఎండీ)  ఆయన సన్నిహితుడు విష్ణుచైతన్యకు ఏసీబీ నోటీసులు ఇచ్చింది. దివంగత మాజీ ఎంపీ ఆదికేశవుల నాయుడు మొదటి నుంచి తెలుగుదేశంలోనే ఉన్నా.. వైఎస్ హయాంలో పార్టీ మారిన ఆయన.. వైఎస్ మరణం తర్వాత మళ్లీ టీడీపీ వైపు మొగ్గు చూపారు. 2014 సార్వత్రిక ఎన్నికల ముందు ఆదికేశవుల నాయుడు మరణించారు. దీంతో.. ఆయన సతీమణి సత్యప్రభకు చిత్తురు అసెంబ్లీ నుంచి టీడీపీ అభ్యర్థిగా టిక్కెట్టు ఇచ్చారు. ప్రస్తుతం ఆమె చిత్తూరు ఎమ్మెల్యే గా వ్యవహరిస్తున్నారు. తమకు అందిన పక్కా సమాచారంతోనే నోటీసులు ఇచ్చినట్లుగా ఏసీబీ అధికారులు చెబుతున్నారు. సేకరించిన ఆధారాలు ఎంతవరకు నిజం అన్నది విచారణలో తేలాల్సి ఉంది.

                  సొమ్ము వ్యవహారంపై ఎటూ తేలలేదని సో రేవంత్ రెడ్డి కి బెయిల్ మంజూరు చెయొద్దని తెలంగాణ ఏజీ విచారణ సమయంలోనే వాదించారు. దీనిపై హైకోర్టు కూడా కాస్త ఆలోచించి బెయిల్ మంజూరు చేసినప్పటికీ తెలంగాణ ఏసీబీకి మాత్రం ఆ వ్యవహారం తొందరగా తేలాలని చెప్పింది. మరీ వ్యవహారంపై  విచారణలో వెలుగు చూసిన అంశాలు నిజాలు అవునో కాదో  వేచి చూద్దాం.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ