గీత రాజకీయ భవిష్యత్తుకు ఫుల్ స్టాప్?

March 11, 2016 | 03:09 PM | 2 Views
ప్రింట్ కామెంట్
MP-kothapalli-Geetha-not-tribal-niharonline

అరకు వైఎస్సార్సీపీ ఎంపీ కొత్తపల్లి గీతకు పెద్ద షాక్ తగిలింది. ఆమె అసలు గిరిజన కులానికి చెందిన వ్యక్తి కాదని, ఆమె ఎన్నికను రద్దు చేసి మళ్లీ ఎన్నికలు నిర్వహించాలని అప్పట్లో గిరిజన ఉద్యోగుల సంక్షేమ సంఘం ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. ఇదే విషయంలో ఇప్పుడు ఆమెకు ఊహించని షాక్ తగిలింది. ఆమె సోదరుడు వివేకానందకుమార్ ఎస్టీ కాదని జిల్లా కలెక్టర్ నివేదిక తేల్చింది. తప్పుడు కులధ్రువీకరణ పత్రంతో బీమా కంపెనీలో ఉద్యోగం సంపాదించారని, ఆతని కుల సర్టిఫికెట్‌పై విచారణ జరపాలని గిరిజన సంఘాలు కలెక్టర్ కు ఫిర్యాదు చేశాయి. దీనిపై అధికారులు చేపట్టిన విచారణలో  వివేకానంద ఎస్టీ కాదని తేల్చారు. ఈ మేరకు అతడికి నోటీసులు కూడా అందజేశారు.

                       కుల వివాదంలో ఇరుకున్న గీతకు ఇది ఊహించని దెబ్బే. ఓవైపు ఆమెపై కోర్టులో కేసు నడుస్తుండగానే, ఆమె సోదరుడు ఎస్టీ కాదని తెలియటంతో అధికారులు గీతను కూడా వివరణ కోరారంట. అయితే తాను పార్లమెంట్ సమావేశాల కారణంగా బిజీగా ఉన్నందున వివరణ ఇచ్చేందుకు మరింత సమయం కావాలని కొత్తపల్లి గీత కోరినట్టు సమాచారం.

           అరకు ఎంపీగా ఎన్నికైన కొత్లపల్లి గీత, ఆది ఆంధ్రా మాల కులానికి చెందిన వ్యక్తి అని, ఆమె క్రిస్టియన్‌గా మారడంతో, 1993లో అప్పటి జాయింట్ కలెక్టర్ ఆమె కులధృవీకరణ పత్రాన్ని రద్దు పరుస్తూ, గీత గిరిజనురాలు కాదని, క్రిస్టియన్ బీసీ ‘బి’ కేటగిరీగా ప్రకటించారు. తాజా పరిణామాల నేపథ్యంలో గీత రాజకీయ భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ