స్పీకర్ నిర్ణయంతో కాంగ్రెస్ కురువృద్ధుడి షాక్

March 11, 2016 | 01:21 PM | 1 Views
ప్రింట్ కామెంట్
janareddy-on-speaker-decision-TTDP-niharonline

తెలంగాణలో జరుగుతున్న పార్టీ ఫిరాయింపులు, వాటికి అసెంబ్లీ స్పీకర్ మద్ధతు ప్రకటించడం పై సీఎల్పీ నేత కుందూరు జానారెడ్డి విస్మయం వ్యక్తం చేశారు.  శుక్రవారం శాసనసభా సమావేశాల్లో భాగంగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, పీఏసీ చైర్మన్ రాంరెడ్డి వెంకటరెడ్డి మృతికి సంతాపం తెలిపిన వెంటనే సభ రేపటికి వాయిదా పడింది. అనంతరం స్పీకర్ చాంబర్ లో జరిగిన సభా వ్యవహారాల కమిటీ (బీఏసీ) సమావేశానికి హాజరైన జానారెడ్డి, సమావేశం ముగిసిన తర్వాత అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మాట్లాడారు. గులాబీ గూటికి చేరిన టీ టీడీపీ ఎమ్మెల్యేలను టీఆర్ఎస్ లో విలీనం చేస్తూ తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ సిరికొండ మధుసూదనాచారి తీసుకున్న నిర్ణయంపై ఆశ్చర్యం వ్యక్తం చేశారు.

                        టీడీపీ టికెట్లపై విజయం సాధించి సభలో ఎమ్మెల్యేలుగా కొనసాగుతున్న 12 మంది సభ్యులను టీఆర్ఎస్ లో ఎలా విలీనం చేస్తారని జానారెడ్డి ప్రశ్నించారు. ‘‘స్పీకర్ నిర్ణయం ఆష్చర్యం కలిగించింది. స్పీకర్ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. చట్టాలు, రాజ్యాంగాన్ని అమలు చేసేవారే వాటిని అతిక్రమిస్తారా? ధర్మాన్ని నిలబెట్టేలా పరిపాలన సాగించాలి’’ అని జానా విజ్నప్తి చేశారు. తన ఇన్నేళ్ల రాజకీయంలో ఇలాంటి ఘటన ఎప్పుడూ చూడలేదని గుర్తుచేసుకున్నారు. అధికార పార్టీ సభ్యుడైనప్పటికీ ఉన్నత స్థానంలో ఉన్న స్పీకర్ సమయోచితంగా వ్యవహరించాలే తప్ప, ప్రభుత్వానికి మద్ధతు పనులు చేయకూడదని హితవు పలికారు.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ