తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ భాగ్యనగర రూపురేఖలను మార్చే విషయంలో అస్సలు తగ్గేలా లేడు. ఇప్పటికే హుస్సేన్ సాగర్ ప్రక్షాళన, బహుళాంతస్తుల నిర్మాణాలు, రోడ్ల అభివ్రుద్ధి, ఇలా చెప్పుకుంటూ పోతే బోలెడన్నీ. ఇప్పటిదాకా టర్కీ ఇస్తాంబుల్ లాగా తీర్చిదిద్దుతానన్న కేసీఆర్ ఇప్పుడు కొత్తగా డల్లాస్ పాట అందుకున్నారు. హైదరాబాద్ ను విశ్వనగరంగా తీర్చిదిద్దుతానని మరోసారి ప్రకటించారు. అమెరికాలోని డల్లాస్ మాదిరిగా మారుస్తానని ఆయన చెప్పారు. ఓ వైపు ఇవన్నీ చెబుతూనే ఏపీ సీఎం చంద్రబాబుపై విమర్శలకు దిగటం కొసమెరుపు. నగర జనాభా కోటికి చేరిన వసతులు సరిగ్గాలేవని, దీనంతటికి టీడీపీ ప్రభుత్వ హయామే కారణమని విమర్శించారు. వర్షం వస్తే రోడ్లన్నీ బకెట్లతో నిండిపోతాయని, బస్తీల్లో బకెట్లతో నీటిని తోడుకునే పరిస్థితులు ఉన్నాయని చెప్పారు. హైటెక్ నగరాన్ని నిర్మించామని చెప్పుకుంటే సరిపోదని చంద్రబాబుపై సెటైర్లు వేశారు.