ఏందేందీ? సినిమా వాళ్లు స్పెషల్ స్టేటస్ కోసమా!!

August 06, 2015 | 02:57 PM | 3 Views
ప్రింట్ కామెంట్
chalasani_srinivas_pawan_mahesh_ntr_niharonline

ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా కోసం దారులన్నింటిని కేంద్రం ఒక్కొక్కటిగా మూసేస్తూ వస్తుంది. ఇక పై ఏ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇచ్చే ప్రసక్తే లేదని తేల్చి చెప్పింది. అయితే మనోళ్లు మాత్రం తమ వంతు ప్రయత్నాలు అస్సలు మానరట. అధికార, ప్రతిపక్షం, విపక్షం తేడా లేకుండా అన్ని పార్టీలు మూక్కుమ్మడిగా కేంద్రంపై దాడి చేయాలని సిద్ధమయ్యాయి. అయితే కేవలం రాజకీయంగానే కాదు వేరే రకంగా ప్రయత్నాలు కూడా చెయ్యాలని చలసాని లాంటి మేధావులు సూచిస్తున్నారు. ప్రత్యేక హోదా కోసం నేతలతోపాటు తెలుగు సినీ పరిశ్రమ కూడా కదలిరావాలట. పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, జూనియర్ ఎన్టీఆర్ లాంటి అగ్రహీరోలతోపాటు మిగతా హీరోలందరూ పోరాటం చెయ్యాలని, అవసరమైతే ఢిల్లీకి కదలిరావాలని ఆయన పిలుపునిస్తున్నాడు. వీరితోపాటు నేతలు కూడా పార్లమెంటును స్తంభింపజేసి ఏపీకి ప్రత్యేక హోదా తేవాలని కోరుతున్నాడు.  అనంతపురం కదిరిలో జరిగిన ఓ సభలో కారెం శివాజీ తో కలిసిన ఈయన మీడియాతో మాట్లాడారు. పోరాడకుండా వెనక్కి వస్తే వీరందరికీ తగిన శాస్త్రి చేస్తామని హెచ్చరించారు.

                                విశాలాంధ్ర ఉద్యమ సమయంలో ఎన్టీఆర్, ఏఎన్నార్ లాంటి అగ్రనటులు తమంతట తాము కదిలొచ్చి అందులో పాల్గొని ప్రభావితం చేశారు. కానీ, ఇప్పుడు పరిస్థితి మారింది. ప్రస్తుతం ఉన్న అగ్రకథానాయకుల్లో ఏ ఒక్కరు కూడా ప్రత్యేక హోదాపై స్పందించడం లేదు. వాళ్లతో పోలిస్తే ఇప్పుడున్న వారికి రాజకీయ విషయాలపై అవగాహన పెద్ద లేదనే చెప్పాలి. పవన్ కళ్యాణ్ లాంటి నటులు కమ్ నేతలు అప్పుడప్పుడు రాజకీయాలపై మాట్లాడినప్పటికీ ప్రత్యేక హోదాపై మాత్రం పూర్తిస్థాయిలో స్పందించలేదనే చెప్పాలి. శివాజీ లాంటి నటులు పదేపదే పవన్ ని ఎత్తిపోడుస్తున్న ఏ రోజు కూడా దానికి ఆయన పెదవి విప్పలేదు. ఇక జూనియర్ 2009 ఎన్నికల ఫలితం తర్వాత టీడీపీ కి, రాజకీయాలకు దూరంగానే ఉండిపోయాడు. ఇక ఆనాటి నుంచి ఏనాడూ వాటి ఊసు లేవనెత్తలేదు. ఇక మహేష్ అంటారా ఇలాంటి విషయాల్లో ఎప్పుడు కలగజేసుకొడు. ఇక మిగతా వాళ్లా సరేసరి. మరి అలాంటి వారు చలసాని పిలుపుకు స్పందిస్తారా?   

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ