అవతలి పక్షాలపై ఎప్పుడూ సెటైరిక్ గా విరుచుకుపడతారు సీనియర్ నేత వెంకయ్య నాయుడు. వ్యక్తులు ఎవరైనా, వారు ఎంత తీవ్ర స్థాయిలో వ్యాఖ్యానించినా సరే సింపుల్ గా, మాంచి ఉదాహరణలతో వారిపై పంచ్ లు వేయడంలో ఆయనకు ఆయనే సాటి. ఇదే క్రమంలో విపక్షాలపై ఈ పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి నిన్న ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ తరపున 25 మంది ఎంపీలను వేటు పడిన విషయం తెలిసిందే. వీరికి మద్దతుగా విపక్షాలు పార్లమెంటు సమావేశాలను అడ్డుకోవడాన్ని వెంకయ్య నాయుడు తీవ్రంగా స్పందించాడు. ఈ సందర్భంగా హిందూ పురాణాలను ఆయన ప్రస్తావించారు. భాగవతంలోని సర్పయాగాన్ని ఆయన గుర్తుచేశారు.
పరీక్షిత్తు మహారాజు తక్షకుడి (సర్పరాజు) చేతిలో హతమయ్యాక ఆయన కుమారుడు జనమేజయుడు సర్పయాగం నిర్వహించాడు. భయంతో వణికిపోయిన తక్షకుడు పాతాళం నుంచి పారిపోయి ఇంద్రుడి సింహాసనాన్ని చుట్టుకుని ఉండిపోయాడు. ఇక విషయం తెలిసిన జనమేజయుడు ఇంద్రుడితోసహా వచ్చి అగ్నికీలలో పడాలని కోరుకున్నాడు. తనకున్న ముప్పును గ్రహించిన ఇంద్రుడు తక్షకుడిని వదిలించుకుంటాడు. అప్పుడు తక్షకుడు యాగాగ్నిలో వచ్చి మసైపోతాడు. ఇఫ్పుడు విపక్షాలకు కూడా ఇంద్రుడికి పట్టిన గతే పడుతుందని గుక్కతిప్పుకోకుండా చెప్పుకొచ్చాడు వెంకయ్యనాయుడు. రెగ్యులర్ విమర్శలు విని... విని ఉన్న పాత్రికేయులకు కూడా వెంకయ్య ఇలా పురాణలను ప్రస్తావించి మరీ పంచ్ లు వేయటంతో కాస్త ఆసక్తిగా ఆలకించారట.