ఇద్దరు చంద్రులు వియ్యంకులు అవుతారా?

May 11, 2016 | 04:57 PM | 12 Views
ప్రింట్ కామెంట్
kcr-chandra-babu-prathyusha-love-matter-niharonline

ఇంతకాలం రాజకీయ ప్రత్యర్థులుగా ఉన్న తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు గత కొంతకాలంగా స్నేహ వైఖరితో మెదులుతున్నారు. అభివృద్ధి తోపాటు, తెలుగు ప్రజలు సుభిక్షంగా ఉండాలంటే తమ తమ వైరమ్యాలను పక్కనబెట్టి ముందకు సాగాలని వీరిద్దరి నిర్ణయంతో అంతా ఆనందంలో మునిగి తేలుతున్నారు. ఈ అంశం పక్కనబెడితే... తల్లిదండ్రుల నిరాదరణకు గురై, ఆపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ దత్తపుత్రికగా మారిన ప్రత్యూష వ్యవహారం గురించి తెలుగు రాష్ట్రాల్లో తెలీని వారు ఉండరు. అయితే తాను ఓ ఆంధ్రా అబ్బాయిని ప్రేమించానని, అతనితోనే తన వివాహం జరిపించాలని ప్రత్యూష మీడియా ముందుకు వచ్చింది. దీంతో రంగంలోకి దిగిన ఇరు రాష్ట్రాల ఇంటలిజెన్స్ అధికారులు అసలు విషయాన్ని ఆరాతీయటం ఆరంభించారు. ఈ క్రమంలో తాను కొరుకున్న అమ్మాయితో  వివాహాన్ని జరిపించాలని వెంకట మద్దులేటి కూడా బాలల హక్కుల సంఘంను ఆశ్రయించాడు.

                         దీంతో ఆ సంఘం అధ్యక్షుడు అచ్యుతరావు ఓ కొత్త ప్రతిపాదన తెరపైకి తెస్తున్నారు. ప్రత్యూషను కేసీఆర్ దత్తత తీసుకున్నట్టుగానే, వెంకట మద్దులేటి రెడ్డిని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి దత్తత తీసుకుంటే బావుంటుందని, దీంతో ఈ ఇద్దరు సీఎంలూ వియ్యంకులు అవుతారని, అది రెండు రాష్ట్రాలకూ ఎంతో ఆనందాన్ని కలిగించే అంశమవుతుందని ఆయన చెబుతున్నారు. మద్దులేటి రెడ్డి తనవద్దకు వచ్చి, తన ప్రేమ కథ గురించి వివరించాడని, అతని ప్రేమలో నిజాయితీ ఉందని గుర్తించానని తెలిపారు. తనకు ప్రత్యూష పేరిట ఉన్న 2 కోట్ల ఆస్తి అక్కర్లేదని, కట్టుబట్టలతో వస్తే చాలని ఆ యువకుడు కోరుతున్నాడని, కేసీఆర్ మానవతా దృక్పథంతో వారిద్దరి వివాహం జరిపించాలని అచ్యుతరావు కోరుతున్నారు. రాజకీయ బద్ధ శత్రువుల నుంచి మిత్రులుగా మారిన వీరిద్దరు ఈ దత్త పుత్రిక-పుత్రుల వ్యవహారంలో వియ్యంకులుగా మారాలన్న ప్రతిపాదన సబబేనా?

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ