కేసీఆర్ ను ఎగ్జాంపుల్ చూపి మరీ క్లాసు పీకాడు

October 27, 2015 | 11:35 AM | 1 Views
ప్రింట్ కామెంట్
Chandrababu-Naidu-ego-classes-to-leaders-niharonline

వ్యక్తిగతంగానే కాదు, వ్యవస్థకు కూడా నష్టం కలిగేందుకు అహంకారం అనేది ఓ కారణమని చెబుతున్నారు ఆంధ్రప్రదేశ్ సీఎం నారా చంద్రబాబునాయుడు. జరిగే నష్టాన్ని నివారించాలంటే అహంకారం అనే దానిని ఆమడదూరంలో ఉంచాలని ఆయన తోటి నేతలకు క్లాసులు పీకారంట. ఉన్నట్టుండి ఇదేందుకనేగా మీ అనుమానం? అక్కడికే వస్తున్నాం. నూతన రాజధాని పరిధిలో భూముల రేట్లు ఇప్పుడు అమాంతం పెరిగిపోయాయి. హైదరాబాద్ లోని ఇండస్ట్రీయల్ ఏరియాలోని భూముల కన్నా సుమారు రెండు మూడు రెట్లు ఎక్కువ ధర ఇప్పుడు అక్కడ పలుకుతుండటం విశేషం. దీంతో టీడీపీకి చెందిన ఆయా ప్రాంత నేతల్లో క్రమంగా అహంకారం పెరుగుతోందట. విషయాన్ని పసిగట్టిన చంద్రబాబు, నష్ట నివారణ చర్యలు ప్రారంభించారు.

తనను కలిసిన ప్రతి నేతకు ‘అహంకారం’పై క్లాసులు పీకుతున్నారట. సోమవారం విజయవాడలోని క్యాంపు కార్యాలయంలోనూ ఆయన ఈ తరహా క్లాసొకటి పీకారు. ‘‘మీ భూముల ధరలు ఇప్పటికే బాగా పెరిగాయి. కొంతమంది పార్టీ నేతలకు అహంకారం పెరిగిపోతోంది. మీ అహాలు తగ్గించుకొని అందరినీ కలుపుకెళ్లండి అని ఉద్భోదించాడట. అంతే కాదు... కేసీఆర్ నాకంటే జూనియర్. మా మధ్య ఎన్ని సమస్యలున్నా ఆయన ఇంటికి వెళ్లి నేరుగా నేనే శంకుస్థాపనకు రావలసిందిగా ఆహ్వానించి వచ్చా. దానికి ఆయన కూడా సానుకూలంగా స్పందించి వచ్చారు కదా. ఇద్దరిలో ఎవరో ఒకరం తగ్గాం గనుకే ఇవాళ రెండు రాష్ట్రాల్లో మంచి వాతావరణం నెలకొంది. అందుకే అహంకారం తగ్గితే వ్యక్తిగతంగా మీకూ మంచిదే’’ అని చంద్రబాబు హిత భోద చేశారట. ఇక తమ అధినేత ఇచ్చిన సుదీర్ఘ క్లాస్ తో నేతలు ఆలోచనలో పడ్డారట తమ్ముళ్లు.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ