అమరావతి కి అంత సీనా? హౌ.. ఆ హౌ...

September 09, 2015 | 11:36 AM | 4 Views
ప్రింట్ కామెంట్
chandrababu-about-amaravati-niharonline.jpg

నవ్యాంధ్రప్రదేశ్ నూతన రాజధాని అమరావతి ఇంకా పునాదిరాయి కూడా పడలేదు. మరోవైపు కేంద్రం నుంచి కూడా నిధుల విషయంలో క్లారిటీ రాలేదు. అయినా టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గంభీరాలు పలుకుతున్నారు. ఓవైపు ప్రతిపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నా ప్రజల్లోకి వెళ్లి రాజధాని గురించి బాగా బాజా వాయిస్తున్నారు. పెట్టుబడులు పెట్టేందుకు కంపెనీలు ముందుకు వస్తున్నా... ప్రస్తుతం అక్కడి పరిస్థితులు అంత అనుకూలంగా లేవనే చెప్పాలి.

                 నిజానికి అమరావతికి గతేడాది దసరా టైంలోనే పునాది పడాల్సి ఉండగా, పరిపాలన జాప్యం, నిధుల లేమీ తదితర కారణాలతో వాయిదా వేశారు. ఇక ఇప్పడు త్వరలోనే ముహుర్తం అంటూ ప్రకటించారు. అంతేకాదు త్వరలో ప్రపంచమంతటా అమరావతి గురించి చర్చించే దగ్గరపడిందని చంద్రబాబు వ్యాఖ్యానించారు. మంగళవారం డ్వాక్రా మహిళా సంఘాలతో సమావేశమైన సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. అమరావతి ప్రపంచస్థాయి నగరాలకు ఏ మాత్రం తగ్గకుండా ఉంటుందని ఆయన అన్నారు. అభివృద్ధిని చూసి ఓర్వలేకనే విపక్షాలు విమర్శలు చేస్తున్నాయని ఆయన అన్నారు. వచ్చే నాలుగేళ్లలో వంద శాతం అక్షరాస్యత సాధించేందుకు డ్వాక్రా మహిళలు కృషి చేయాలని ఆయన కోరారు. ఎవ్వరూ ఊహించని విధంగా నదుల అనుసంధానాన్ని టీడీపీ ప్రభుత్వం సాకారం చేస్తుందని హామీ ఇచ్చారు.

               ఇది బాగానే ఉంది సింగపూర్ నిపుణులతో వేయించిన ప్లాన్ వర్కవుట్ అవుద్దో కాదో తెలీక ముందే ఇలా ప్రకటనలు చేస్తే మొదటికే మోసం వచ్చే అవకాశం ఉంది. పెట్టుబడుల కోసం విదేశీ పర్యటనల కోసం వెళ్లినప్పుడు ప్రతిపక్షాలతోపాటు కేంద్రం కూడా ఓ మోస్తరు వార్నింగ్ బాబుకు ఇచ్చింది. నిధులను అడ్డగోలుగా ఖర్చుపెట్టి పెట్టుబడులు తక్కువగా తెచ్చారని ఆరోపణలు వచ్చాయి. ఇలాంటి టైంలో ఇంకా పునాది రాయి పడకముందే అమరావతి గురించి అంతలా చెప్పాల్సిన అవసరమేముంది. ఓవైపు నిధుల గురించి ఇంకా స్పష్టత రాని టైంలో అంతర్జాతీయ స్థాయి ఏమోగానీ ముందసలు టైంకి ఇది ప్రారంభమౌతుందా అన్నది ఇప్పుటికీ అనుమానమే. అయినా అమరావతికి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు అంత సీన్ రావాలంటే మాత్రం ఇప్పుడున్న పరిస్థితుల్లో  కష్టమే.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ