గీత స్త్రీ లింగమా? పుంలింగమా నాయుడమ్మా? జగన్ దేమో ఉడుకు రక్తంతో గీత దాటే దుడుకు వయసాయె మరి. శ్రీకృష్ణులవారు శిశుపాలుడికి నూరు తప్పుల ఆంక్ష పెట్టేరు. నాయుడుగారు రెడ్డి బాబుకి గీత దాటేంత వరకు ఉపేక్షించగలం, దాటితే అయిపోగలడని హెచ్చరిక జారీచేశారు. పైగా పెద్దరికం కాసేపు పాకెట్ లొ దోపి జగన్ లాంటి వారిని చాలామందిని చూసేనని ఒక ఇన్ఫర్మేషన్ అందజేశారు. వయసు లేత అయినందున ఉండేలు దెబ్బలకి ఇంకా టైముంది. ఆయనే ముదురు తాడు. తొండ ఒక్క రోజులోనే వెల్లి విరిసిందా మరి.
ఈదో సందులో దివంగత కాంగ్రెసు నాయకుడు జనార్దన్ రెడ్డి ప్రతి అంశాన్నీ రాజకీయం చేసేవారని జ్నాపకం చేసుకున్నారు. మరోక ముఖ్యవిషయం ప్రస్తావించేరు. పుష్కర మరణాల విషయంలో తాను గీత దాటలుద. కామకోటి పీఠాధిపతి పూజాదికాల కారణంగా తాను అచ్చోట స్నానమాచరించేనని దాన్ని పొరపాటు అనే పేరుతో ఆర్యులు పిలుస్తారని, తప్పిదం అనే పద ప్రయోగం ఎంత మాత్రం సబబు కాదని చెప్పి ఊరుకోలేదు. ఈ ఘటనలో కైవల్య ప్రాప్తిచెందిన వారి కుటుంబాలకు బోనసుగా పది లక్షల రూకలు చెల్లించిన విషయం నెమరువేసుకున్నారు. అసెంబ్లీ సాక్షిగా ఎన్నో హోయలు, ఎన్నెన్నో లయలు, చమక్కులు, చమత్కారాలు, ముద్దులు, వార్నింగులు... సర్వేజనా సు:ఖినోభవంతు... అందరూ కుమ్మక్కయి హోదా పట్రండర్రా రాష్ట్రానికి. భూమ్మీద ఇలాంటి చోద్యం, విడ్డూరం కనివిని ఎరగడం అని లోకం విస్తూపోవాలి. అందుచేత అధికార పక్షాలు కుమ్మక్కవ్వడం ఆవశ్యం!