తొమ్మిది ఏళ్ల పాలనలో ఉద్యోగులకు చుక్కలు చూపించాడు. తాను నిద్ర పోలేదు... వారిని నిద్ర పోనీయలేదు. ఎవరి గురించి చెబుతున్నామో అర్థమైయ్యింది కదా. తెలుగు దేశం అధినేత, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గురించి. ప్రస్తుతం ఆయన మారిపోయాడు. పాలన కుంటుపడింది. అధికారుల అలసత్వంతో సంక్షేమ పథకాలు ప్రజలకు అందట్లేదు. జనాల్లో వ్యతిరేకత మొదలయ్యే పరిస్థితులు నెలకొన్నాయి. దాంతో ఆయనలో ఉగ్ర నరసింహుడు నిద్ర లేచాడు. ‘పనిచేసే వారే నా దగ్గర ఉంటారు. పనిచేయని వారిని ఉపేక్షించేది లేదు’ అని బాబు తేల్చి చెప్పాడు. ఉద్యోగులు పనితీరు మార్చుకోవాల్సిందేనని కూడా ఆయన వ్యాఖ్యానించారు. రాష్ట్రాభివృద్ధి కోసం తాను 24 గంటలు కష్టపడుతుంటే, అధికారుల నుంచి పూర్తిస్థాయి సహకారం అందడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. మరో మూడు నెలలు వేచి చూస్తానని, ఇదే ధోరణి కొనసాగితే పాత చంద్రబాబును చూపిస్తానని ఆయన హెచ్చరించారు. గురువారం విజయవాడ క్యాంపు ఆఫీసులో మీడియాతో మాట్లాడారు. గతంలో మాదిరిగా కాకుండా మీతో సానుకూలంగా వ్యవహరిస్తున్నా. అయితే, నేను ఎంత కష్టపడుతునా, ఉద్యోగుల నుంచి ఆ స్థాయి సహకారం అందడం లేదు. నిర్లిప్తంగా, నిర్లక్ష్యంగా ఉన్నా గతంలో సహించేవాడిని కాదు. మొద్దు నిద్రను వదిలించేందుకు సన్నద్ధంగా ఉన్నాను. మరో మూడు నెలల్లో చంద్రబాబులో అపరిచితుడిని మనం చూడబోతున్నామన్న మాట.