గుసగుసలు: నెహ్రూ గురించి మూడు ముచ్చట్లు

August 27, 2015 | 04:11 PM | 4 Views
ప్రింట్ కామెంట్
unknown_facts_about_nehru_niharonline.jpg

పండిట్ జవహర్ లాల్ నెహ్రూ. స్వతంత్ర్య భారత దేశపు ప్రప్రథమ ప్రధాని. గాంధీ శిష్యుడిగా ఆయన సలహాలతో , ప్రజాకర్షణ కలిగిన సంస్కరణ వాద నాయకుడిగా ఎదిగి నెహ్రూ కాంగ్రెస్ అధ్యక్షుడయ్యాడు. ఆపై ప్రధాని పీఠమెక్కి సుదీర్ఘకాలం పాటు దేశానికి పాలన అందించారు. కానీ,  నిజాలు కొంచెం చేదుగా...చాల అమానుషంగ కూడా ఉంటాయి. ఈ సందర్భంగా ఆయన గురించి సేకరించిన మూడు పచ్చి నిజాలు మీకోసం...

  1. నెహ్రూ జన్మస్థలం అందరూ ఆనంద్ భవన్ అనుకుంటారు. కానీ, ఇది అసలైన జన్మస్థలం కాదు. నెహ్రూ తండ్రి మోతీలాల్ నెహ్రూ తన రెండో భార్య అయిన స్వరూపరాణి తుస్సుతో కలిసి అలహాబాద్ లోని మీర్ గంజ్ ప్రాంతంలో ఓ పాత భవనంలో నివసించేవారట. అక్కడే ఆమె నెహ్రూకి జన్మనిచ్చింది. విషయము ఏమిటంటే అది అప్పటినుచి ఇప్పటి వరకు వేశ్యా గృహం. అయితే తర్వాత పరిస్థితుల దృష్ట్యా వారిద్దరిని మోతీలాల్ ఆనంద్ భవన్ కు మకాం మార్పించాడట. అంతేకాదు మనం అనుకున్నట్లు ఆనంద్ భవన్ మోతీలాల్ సొంత భవనం కాదు. అది ఆయన యజమాని అయిన ముబారక్ అలీది. ముందు అది ఇష్రాత్ మంజిల్ గా పేరు ఉండేది. ఆ తర్వాత దానిని మోతీలాల్ కొనుగోలు చేసి పేరు మార్చి ఆనంద్ భవన్ గా చేశారట. ఇప్పుడది స్వరాజ్ భవన్ గా చెలామణి అవుతోంది. మొత్తానికి నెహ్రూ వేశ్యా గృహంలో జన్మించాడనేది నమ్మాల్సిన నిజం. దీనికి నిదర్శనంగా 8 ఏళ్ల ప్రాయం వరకు నెహ్రూ జ్నాపకాలేవీ భద్రపరచలేదన్నది దీనికి మరింత బలం చేకూరుస్తుంది.
  2. జవహార్ అనే పేరు ఎలా వచ్చిందంటే... నెహ్రూ పూర్తి పేరు పండిట్ జవహార్ లాల్ నెహ్రూ. పండిట్ అనేది గౌరవ సూచకంగా వాడేది. కానీ, జవహార్ అన్నది ఎందుకు పెట్టారన్నదానిపై క్లారిటీ లేదు. దానిపై కూడా ఓ కథనం ఉంది. స్వరూప గర్భవతిగా ఉన్న సమయంలో ఓసారి దంపతులిద్దరూ కలిసి గంగా నది వద్దకు పవిత్ర స్నానమాచరించేందుకు వెళ్లారట. అక్కడ ఓ సాధువు వీరిని చూసి మోతీలాల్ తో మాటలు కలిపాడట. అంతలో సాధువు నీ భార్య కడుపులో ఉంది భూతం, అది భయటికి వస్తే దేశం సర్వ నాశనమైపోతుంది. కాబట్టి జెహర్ (హిందీలో విషం) ఇచ్చి చంపేసేయ్ అని సలహా ఇచ్చాడట. పాపం ఇదంతా కూత వేటు దూరంలో ఉండి వింటున్న ఆమె భార్య సాధువు జెహర్ అని ఎందుకన్నాడని మోతీని అడిగిందట. దానికి ఆయన సాధువు జెహర్ అనలేదని, పుట్టబోయే బిడ్డకు జవహార్ (హిందీలో ఆభరణం) అని పేరు పెట్టాలని సూచించాడని మోతీలాల్ అబద్ధం చెప్పాడట. అలా ఆయన పేరులో  జవహార్ వచ్చి చేరింది.
  3. నెహ్రు గారి రాచలీలల గురించి... వీటి విషయానికొస్తే ఆయనగారిని అసహ్యించు కొని వారు వుండరు. నిజానికి ఆయన ఆ యావే దేశానికి మొదటి ప్రధాన మంత్రి కావడానికి ఓ రకంగా సాయపడిందట కూడా. నెహ్రూ చిన్నతనంలోనే భార్యను కోల్పోయారు. దీంతో ఆయనకు అమ్మాయిల పిచ్చి ఉండేదని ఓ టాక్. ముఖ్యంగా భారత్ చిట్టచివరి వైశ్రాయ్ లార్డ్ మౌంట్ బాటెన్ భార్య ఎడ్వినా తో నెహ్రూ నడిపిన ప్రేమ వ్యవహారం పబ్లిక్ గా తెలిసిందే. ఇంగ్లాండ్ వెళ్లాక ఇద్దరి మధ్య ప్రేమలేఖలు కూడా పంపుకున్నారంటే రొమాన్స్ ఏపాటిదో అర్థం చేసుకోవాల్సిందే. తన తల్లి నెహ్రూతో నడిపిన ప్రేమాయణం గురించి ఎడ్వినా కూతురు పమేలా హిక్స్ స్వయంగా ఓ పుస్తకంలో వెల్లడించడం విశేషం. అంతేకాదు ఎడ్వినా కోసం నెహ్రూతోపాటు ముస్లిం లీగ్‌ అధినేత జిన్నా కూడా ప్రయత్నించేవాడట. ముగ్గురి మధ్య ట్రైయాంగిల్ లవ్ స్టోరీ నడించిందని ఓ టాక్. ఇంకా దారుణమైన విషయమేంటంటే... సరోజినీ నాయుడు కూతురు పద్నాజ నాయుడు తో నెహ్రు గారి ప్రేమాయణం. అది ఎంతవరకు వచ్చిందంటే... అయన పడక గదిలో ఆమె ఫోటో ఉండేదాకా. ఈ విషయమై కూతురు ఇందిరతో తరుచు నెహ్రూకి వాగ్వివాదం కూడా జరిగేదట.

అసలు దేశానికి ప్రపథమ ప్రధాని కావాల్సింద నెహ్రూయే కాదు. అందుకోసం జరిగిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ఎన్నికల్లో నెహ్రు గారు అభ్యర్థి అయిన సర్దార్ వల్లభాయ్ పటేల్ పై దారుణంగా ఓడిపోయారు. ఇక తీర్మానం ప్రకారం పటేల్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ తోపాటు దేశానికి ప్రధాని కావాలి. కానీ, అలా జరగలేదు. కారణం జవహర్ లాల్ నెహ్రు యొక్క అధికార దాహం, దానికి ఆద్యం పోస్తూ గాంధీ తీసుకున్న తప్పుడు నిర్ణయం. ప్రధాని పదవి దక్కకపోవటంతో కాంగ్రెస్ ను చీల్చాలని నెహ్రూ ప్రయత్నిస్తే... గాంధీ భయపడి పటేల్ ను తప్పుకోమని కోరాడట. ఆ ఉత్తరం ఇంకా ఢిల్లీలోని పటేల్ స్మారక భవనంలో ఉంది.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ