భౌ, భౌ.. భౌ...

October 16, 2015 | 03:48 PM | 2 Views
ప్రింట్ కామెంట్
Congress-leader-Shravan-TRS-govt-dog-niharonline

కేసీఆర్ పాలనాదక్షతపై అస్మదీయులు సంతృప్తితోనూ, తస్మదీయులు అసంతృప్తితోనూ కాలక్షేపం చేస్తున్నారు. ఆయన మా నాన్న ఆయన పోతుంటే అదో అందం. కానీ, వికారాబాదు, బెల్లంపల్లి శాసనసభ్యులు కుదురుగా ఉండక ప్రభుత్వోద్యోగుల్ని చెయ్యిచేసుకుని, లైంగిక భాషతో అవమానించినట్లు రాద్ధాంతం జరుగుతోంది. హరీష్రావు దగ్గరకు చేరిన పంచాయితీ లో ఆయన దోషుల్ని బహిరంగ క్షమాపణ చెప్పమని సూచించేరు.

అదే కేసీఆర్ అయితే ముక్కునేలపై రాయమందురు. మేము అధికారంలోకి వస్తే వాచ్ డాగ్ లా ఉంటాననే భావంతో కాపలాశునకం పాత్ర పోషిస్తాననటం కేసీఆర్ వినయానికి, విశ్వాసానికి గీటురాయిగా భావించి అందలం ఎక్కించేరు. నోరుజారిన కాపలా కుక్క అన్న మాటనే కాంగ్రెసు వారు, చూశారా కాపలా కుక్క కాదు, పిచ్చి కుక్కల మాదిరి పరిపాలిస్తున్నారు అని గగ్గోలు పెడుతున్నారు. ఏదో ఓటర్ల మనసు జయించే సద్ధుద్ధితో కాపలా కుక్క సామ్యం వాడేరు దొరగారు. అంతే జై కాలభైరవా!

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ