చంద్రబాబు సాక్షి పేపర్ చదువుతారా?

November 27, 2015 | 10:12 AM | 2 Views
ప్రింట్ కామెంట్
chandra-babu-naidu-suggest-people-do-not-read-sakshi-niharonline

రాజకీయా పార్టీల మధ్య వార్‌ మాత్రమే కాక సమాజ సహితానికి సమైక్యమై పని చేయాల్సిన పత్రికరంగం వాటికి కొమ్ముకాయటం మనకు తెలిసిందే. అధికార పక్షం, ప్రతిపక్షం, విపక్షం ఇలా ఒక్కొక్కరు ఒక్కో దానిని నమ్ముకుని డబ్బాలు కొట్టుకోవటం రోజూ మనం చూస్తూనే ఉన్నాం. ఫలానా పేపర్ చదవాలంటే ఆ పార్టీకి చెందిన మ్యాటర్ తప్పా మరేం కనిపించదు. పైన చెప్పుకున్నట్లు సమానత్వం పాటించే పత్రిక ఏదైనా ఉందా చెప్పమంటే ఆలోచించటం ప్రతీ ఒక్కరి వంతు అవుతుంది. వీరు వారిని, వారు వీరిని ఏకీపాడేయటం పొద్దుపొద్దునే వీటితోనే మొదలౌవుతుంది.

అయితే ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గురువారం విజయవాడలో  సాక్షి పత్రికపై కొన్ని ఆసక్తికర కామెంట్లు చేశారు. వైసీపీ అధినేత జగన్ మానసపుత్రిక ‘సాక్షి’ పత్రికను అసలు చదవొద్దని ఆయన ప్రజలకు సూచించారు. ‘‘అవినీతి సొమ్ముతో పెట్టిన ఆ పత్రిక అసత్య కథనాలతో ప్రజలను తప్పుదోవ పట్టించడానికి ప్రయత్నిస్తోంది. ఆ పత్రికను చదివితే అయోమయమే తప్ప వాస్తవాలు తెలియవు. దాన్ని చదివి లేనిపోని తలనొప్పులు తెచ్చుకోవడమే అవుతుంది. దానికి బదులు చదవకుండా ఉండటం మేలు’’ అని చంద్రబాబు వ్యాఖ్యానించారు.

అలాగే రాజకీయాలతో సంబంధం లేని పత్రికలను చదవాలని ఆయన ప్రజలకు సూచించారు. ‘‘ఆ పత్రికేదో స్వర్గంలో పుట్టినట్లు సిగ్గులేని రాతలు రాస్తోంది. దాని యజమాని వారానికోసారి కోర్టుకు వెళుతున్నాడు కూడా" అంటూ చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అంటే ఆయన కూడా సాక్షినే ఫాలో అవుతున్నారన్నమాట. తప్పదుకదా రాజకీయాల్లో అన్నీ చేయాలిమరి.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ