ఆయన ‘అసహనం’ బీజేపీకి బాగా హెల్ప్ అయ్యింది

November 26, 2015 | 05:04 PM | 5 Views
ప్రింట్ కామెంట్
aamir-khan-intolerance-comments-helps-to-BJP-niharonline

మత అసహనం ఈ మాట ఇటీవలి కాలంలో దేశంలో మారి మోగిపోతుంది. ఎందరో కవులు, కళాకారుల నోటి నుంచి వచ్చిన మాట వారికి లేనిపోని ఇబ్బందులు కొని తెచ్చిపెట్టింది. ముఖానికి సిరాలు పూయటం దగ్గరి నుంచి లెంపకాయకి లక్ష అనే నినాదం దాకా వచ్చింది. అయితే పనిలో పనిగా అదనంగా అధికార బీజేపీని ఎన్నో ఇబ్బందుల్లోకి నెట్టిపడేసింది. విపక్షాలకు ఆయుధంగా మారిన బీజేపీని చెడుగుడు ఆడుకున్నాయి. అయితే ఇన్నాళ్లూ చాలా మంది నోటికి పనిపెట్టిన ఈ మాట ఇప్పుడు కొట్టుకుపోతోంది. దీనికి కారణం బాలీవుడ్ హీరో అమీర్ ఖాన్. నోటి దూలతో అమీర్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దేశవ్యాప్తంగా ఆయనపై తీవ్ర వ్యతిరేకతను ప్రదర్శించేలా చేస్తున్నాయి.

                                            అయితే అమీర్ చేసిన మత అసహనం వ్యాఖ్యలతో బీజేపీకి ఎంతో మేలు జరిగిందంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఆయన వ్యాఖ్యలు సరికాదంటూ, హిందూ సమాజంతో పాటు ఎంతో మంది భారతీయులు విరుచుకుపడుతున్నారు. ఇక దీనికి మద్ధతునిస్తూ ఓ ప్రముఖ దినపత్రిక నిర్వహించిన ఆన్ లైన్ సర్వే ఈ విషయాన్ని బలపరుస్తుంది. "భారత ముస్లింకు ఇండియాకన్నా మంచి దేశం, హిందువుల వంటి మంచి పొరుగువాళ్లు దొరకరు" అన్న బీజేపీ మాటలను భారతావని ఆహ్వానిస్తోంది. ఈ మాటలు సరైనవేనా? అని ఆన్ లైన్ పోల్ నిర్వహించగా, 88 శాతం మంది 'అవును' అని చెప్పారు. మరి అమీర్ ఖాన్ ఏ స్ఫృహతో ఈ మాటలు అన్నాడోగానీ ఆరకంగా బీజేపీకి కాస్తంత ఊరట లభించినట్లయింది. భారత ప్రజలు ప్రస్తుతానికి 'అసహనం' అన్న మాటను పక్కనబెట్టి, అమీర్ ను తిడుతూ, బీజేపీకి మద్దతుగా నిలుస్తున్నారు. అలా అమీర్ బీజేపీకి పరోక్షంగా పెద్ద హెల్ప్ చేశారన్నమాట.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ