చంద్రబాబు కొత్త స్లోగన్ వెనుక మతలబు

February 26, 2016 | 12:11 PM | 1 Views
ప్రింట్ కామెంట్
Chandrababu_naidu_population_increase_niharonline

ఓవైపు జనాభా పెరిగిపోతుందని, రానున్న రోజుల్లో చైనాను అధిగమించి అగ్రస్థానంలో నిలుస్తుందని టెన్షన్ పడుతున్న వేళ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.  ‘‘ఎక్కువ మంది పిల్లలను కనండి. రాష్ట్ర జనాభాను పెంచండి’’ అంటూ ఆయన చేసిన సరికొత్త ప్రకటన పలువురిని ఆశ్చర్యానికి గురి చేస్తోంది. పశ్చిమగోదావరి జిల్లా కేంద్రం ఏలూరులో నిన్న 'కాపు రుణమేళా’ పేరిట జరిగిన కార్యక్రమంలో చంద్రబాబు కాపులకు రుణాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సుదీర్ఘ ప్రసంగం చేసిన చంద్రబాబు పై వ్యాఖ్యలు చేశారు.

అయితే దీని వెనుక ఉన్న అసలు కారణం ఏంటంటే... యువత జనాభా గణనీయంగా పడిపోవటమే. ఏపీలో జనాభా శాతం తగ్గుతోంది. మరణాల సంఖ్యతో సమానంగా జననాలు ఉన్నాయి. జనాభాలో యువత శాతం తగ్గుతోంది. ఇప్పటికే చాలా దేశాల్లో జనాభా శాతంలో యువత తగ్గిపోవడంతో ఆయా దేశాలు అప్రమత్తం అవుతున్నాయి. భవిష్యత్ పై ఆందోళనలో ఉన్నాయి. మనం కూడా దూరదృష్టితో ఆలోచించాలి. పిల్లల విషయంలో మనం మరింత ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉంది అని చంద్రబాబు ప్రజలకు సూచించారు.

గతేడాది ఓ ప్రముఖ ఛానెల్ నిర్వహించిన సర్వే ప్రకారం దేశ జనాభాలో యువత శాతం 37 శాతానికి పడిపోయింది. గత జనాభా లెక్కల ప్రకారం దాదాపు 12 శాతం తగ్గిందన్న మాట. యువత జనాభా తగ్గిపోతున్నప్రపంచ దేశాల్లో భారత్ నాల్గో స్థానంలో ఉండటం గమనార్హం.  ఇక తెలుగు రాష్ట్రాల విషయానికొస్తే ఏపీ 7వ స్థానంలో ఉండగా, తెలంగాణ 9వ స్థానంలో ఉంది.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ