పొలిటికల్ టాక్: వైకాపా గూటికి చిరంజీవి?

February 26, 2016 | 02:50 PM | 2 Views
ప్రింట్ కామెంట్
Chiranjeevi-joins-YSRCP-niharonline

కడదాకా అదేనండీ రాజకీయాల్లో ఉన్నంత కాలం కాంగ్రెస్ లోనే కొనసాగుతానని అనౌన్స్ చేసి 48 గంటలు గడవకముందే చిరంజీవి ఏంటీ? వైకాపాలో చేరడమేంటి అనుకుంటున్నారా? ప్రస్తుత పరిణామాలు చూస్తే ఎవరికైనా అలాంటి అనుమానాలు కలగక మానవు. కాంగ్రెస్ పార్టీలో  రాజ్యసభ సభ్యుడిగా కొనసాగుతున్న చిరంజీవి పైకి గంభీరాలు పలుకుతున్నప్పటికీ ఆ పార్టీకి క్రమంగా దూరమవుతున్నట్లే కనిపిస్తోంది. రెండు రోజుల క్రితం బీజేపీలో  చేరుతున్నట్టు వార్తలు రాగా, వాటిని ఆయనే స్వయంగా ఖండించారు కూడా. అయినప్పటికీ,  తాజాగా చిరంజీవి స్వగ్రామం మొగల్తూరు, పాలకొల్లులో జరిగిన సంఘటనలు, ఆపై కాంగ్రెస్ నేతలు మీడియా సమావేశంలో చేసిన వ్యాఖ్యలు పలు అనుమానాలను పుట్టిస్తున్నాయి.

కాంగ్రెస్ నేతలకు తెలియకుండానే చిరు పర్యటన సాగడం, అంతకుమించి వైకాపా నేతలకు దగ్గర ఉండి ఆయా ఏర్పాట్లు చూసుకోవాలని చెప్పడం, తన పర్యటనలో కాంగ్రెస్ నేతలను దగ్గరికి తీసుకోకపోవటంతో చిరంజీవిపై అనుమానాలు పెట్టుకున్నారు కాంగ్ నేతలు. అన్నింటికన్నా ముఖ్యంగా జగన్ బ్యాచ్ కి పెద్దపీట వేయడంపై కాంగ్రెస్ నేతలు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఈ విషయమై హై కమాండ్ కు ఫిర్యాదు చేయనున్నామని కూడా తేల్చి చెప్పారు.

ఇప్పటికే దాసరిని దగ్గరికి తీసుకోవటంలో సక్సెస్ అయిన జగన్, ఇప్పుడు అదే కులానికి చెందిన చిరును కూడా గాలమేసి లాగుతున్నట్లు తెలుస్తోంది. అయితే వీరిద్దరు ఒకే పార్టీలో ఇమడటం అనేది కాస్త కష్టమయిన విషయం అయినప్పటికీ అది సులువుగానే పరిష్కరించవచ్చని, ఇక చిరు చేరిక ఆపరేషన్ ఆకర్ష్ లో భాగంగా సాధ్యమయ్యే పనేనని పొలిటికల్ పండితులు చెబుతున్నారు. అయినా ఏ నిమిషానికి ఏం జరుగుతుందో రాజకీయ క్రీడలో ఎవరం చెప్పలేం?

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ