మైండుంటేనే మైండు గేమ్!

August 28, 2015 | 05:30 PM | 2 Views
ప్రింట్ కామెంట్
cm-ramesh-arresr-jagan-KTR-niharonline.jpg

సీఎం రమేష్ అంటే ఆ పేరు గల ముఖ్యమంత్రి ఎవడూ ఆంధ్ర భూప్రపంచంలో లేడు. అది ఒక పేరుతో గల నామవాచకం. అనగా చింతకుంటమునెయ్య రమేష్ అనమాట. ఈ పేరు గలాటా ఇలా ఉండగా రాజన్న వంశోద్ధారకుడు జగనన్న ఈ సదరు రమేష్ పేరును బరిలోకి ఈడ్చేడు. నాతో ఫోన్లో మాట్లాడేడని, దానిని పురస్కరించుకిన తను కేటీఆర్ తో మాట్లాడేనని కూడా చెప్పేడు. ఈ ప్రతిపక్ష నాయకుడితో తను మాట్లాడటమేమిటని రమేష్ చాలా బాధపడి మనసు చెడగొట్టుకున్నాడు. పత్రికా ముఖంగా ఖండించి ఊరటిల్లేడు.

దీన్ని మైండ్ గేమ్ అని పిలుస్తున్నారు. ఇంతవరకూ యుద్ధం అంటే రక్తపాతం, బాంబులు, ఫిరంగులు అనుకునే రోజులు పోతున్నాయి. ఆర్థిక మూలాలకి చెదపట్టించి వ్యవస్థల్ని కుప్పకూల్చే వినూత్నమైన, కడు దుర్మార్గమైన యుద్ధరీతులు భవిష్యత్తులో గోచరిస్తున్నాయి. అలాగే గేమ్ కానీ మైండ్ గేమ్ తో క్యారెక్టర్ని పాతరేసి అయిన వారూ కానివారూ శంకించే ప్రక్రియ అన్నమాట. దీనికి అంతూపొంతూ లోతూ దారి ఉండదు. ఈ వైకుంఠపాళిలో నిజంగా ఫోన్ చేసి మాట్లాడి అవతలి వెర్రి నాగన్న తో ప్రెస్ వారికి లీక్ చేసి, ఆ తర్వాత తోనే నేను చెయ్యలేదని ఖండించే పన్నాగం ఉంటే? ఫోన్ ట్యాపింగు మంత్రం ఒకటే ఆదుకోగలగాలి! ఓం శాంతి, శాంతి:!

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ