జగన్ అది కంట్రోల్ చేసుకుంటే చాలా మంచింది

August 28, 2015 | 02:19 PM | 1 Views
ప్రింట్ కామెంట్
jagan_mohan_reddy_on_CM_chair_niharonline.jpg

ప్రభుత్వ వైఫల్యాలను దొరికిపుచ్చుకోవటం, వాటి ఆధారంగా విరుచుకుపడటం ప్రతిపక్షనేతకు ఉండాల్సిన లక్షణం. కానీ, అది మచ్చుకు కూడా జగన్మోహన్ రెడ్డి లో లేవన్నది అంతే నిజం. పాలనా పరంగా ప్రభుత్వాలను ఎండగడుతున్న టైంలోనే జారే ఆ ఒక్కమాటే ఆయన కొంప ముంచుతూ వస్తుంది. సీరియస్ గా ఉద్యమాలు, ఆందోళనలు చేపడుతున్న సమయంలో మాటలు కూడా అలానే ఉండాలి.

              కానీ, ఆయన వ్యవహార శైలి అలా లేదు. ప్రతీసారీ నేను ముఖ్యమంత్రినవుతా... మీ కష్టాలు తీరుస్తా... అనటం హాస్యాస్పదంగా మారుతుంది. ప్రత్యేక హోదా కోసం ఢిల్లీలో ధర్నా చేసిన సమయంలో, తొక్కిసలాట బాధితులను పరామర్పించడానికి వెళ్లినప్పుడు ఇలా సమయం సందర్భం చూసుకోకుండా పదే పదే ముఖ్యమంత్రినవుతాననడం మరీ విడ్డూరం. పరామర్శలు, విమర్శలు సక్సెస్ అయినప్పటికీ ఆ వీక్ నెస్ తో ఆయన దొరికిపోతున్నారు. రాజకీయ నాయకుడికి, ముఖ్యంగా ప్రతిపక్ష నేతకి ఉండాల్సింది ఓర్పు. అది లేకపోతే చాలా కష్టం. జనాల్లో పాజిటివ్ స్పందన వస్తున్న ఈ సమయంలో ఇలా నోరు జారి అభాసుపాలు కావటం జగన్ కు కరెక్ట్ కాదు. ముందు సీనియర్ల దగ్గరి నుంచి సలహాలు స్వీకరించాలి, సందర్భానుసారం మాట్లాడటం ఆయన ఇంకా చాలా నేర్చుకోవాలి. భవిష్యత్ గురించి కాదు ముందు ఉన్న సమస్యల గురించి దృష్టిసారిస్తే ఆయన రాజకీయ భవిష్యత్ కి చాలా మంచిది.  

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ