ఆత్మహత్యలపై అడ్డగోలు వ్యాఖ్యలు

April 29, 2015 | 12:26 PM | 22 Views
ప్రింట్ కామెంట్
haryana_minister_farmer_comments_niharonline

దేశ వ్యాప్తంగా చోటుచేసుకుంటున్న రైతు ఆత్మహత్యలతో ఇప్పటికే కేంద్రం ఇరుకున పడింది. ఇటీవల ఢిల్లీలో గజేంద్ర సింగ్ అనే రైతు ఆత్మహత్య చేసుకోవటంతో ఈ సమస్య మరిత జఠిలమైంది. తాజాగా రైతుల ఆత్మహత్యాలపై హర్యానా వ్యవసాయశాఖ మంత్రి ఓపీ ధనకర్ తనదైన శైలిలో వివాదాస్పదంగా వ్యాఖ్యలు చేశారు. ఆత్మహత్యలకు పాల్పడుతున్న రైతులు పిరికివాళ్లు, క్రిమినల్స్ అని వ్యాఖ్యానించారు. అలాంటి వారికి ప్రభుత్వం సాయం చేయదని నిష్కర్షగా చెప్పారు. పిరికివాళ్లైతేనే ఆత్మహత్య చేసుకుంటారని, బాధ్యతల నుంచి తప్పించుకోవడానికే ఇలా చేస్తున్నారని మంత్రి ధనకర్ విమర్శించారు. దేశ చట్టాల ప్రకారం ఆత్మహత్య చేసుకోవటం నేరమని, చట్టాన్ని అతిక్రమించి ప్రాణాలు తీసుకునేవారు నేరస్థులని అంటున్నారు. రాజకీయ వర్గాల్లో మంత్రి వ్యాఖ్యలు  కలకలం రేపాయి.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ