తెలుగు రాష్ట్రాల్లో నోటుకు ఓటు వ్యవహారం బయటపడటం ఏమో గానీ విమర్శలు చేసుకునేందుకు రాజకీయ నేతలకు మాత్రం మాంచి టాపిక్ దొరికినట్లయ్యింది. కాంగ్రెస్ సీనియర్ నేత వీ హన్మంతరావు అయితే ఏకంగా ఈ వ్యవహారంలో కేంద్రం స్పందించాలంటున్నారు. దీని కోసం పోలికలు కూడా తీస్తున్నారాయన. ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ న్యాయ శాఖ మంత్రి జితేంద్ర సింగ్ తోమర్ ను తప్పు చేసినందుకు అరెస్ట్ చేసి జైలు కు కేంద్రం పంపిందని, అలాగే ఇప్పుడు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యవహారంలో ఎందుకు ఉపేక్షిస్తుందని ప్రశ్నించారు. ప్రజలు అన్నీ గమనిస్తున్నారని ఆయన చెప్పారు. చట్టం ముందు సీఎం అయినా, చీమైనా ఒక్కటేనని చెబుతున్నారు. చంద్రబాబు గనుక తప్పు చేయకపోతే తాను స్టీఫెన్ సన్ తో మాట్లాడలేదని, రేవంత్ ను పంపలేదని గట్టిగా చెప్పోచ్చు కదా, కానీ, ఎందుకలా చేయటం లేదని వీహెచ్ ప్రశ్నిస్తున్నారు.