భూ సమీకరణ ఆర్డినెన్స్ పై ఉద్యమంలో బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమించేందుకు కాంగ్రెస్ సిద్ధపడినట్లు తెలుస్తోంది. ప్రముఖ గాంధేయ వాది అన్నాహజారే చేస్తున్న ఉద్యమానికి మద్ధుతు ఇవ్వాలని నిర్ణయించిందట. కేంద్రానికి వ్యతిరేకంగా హజారే ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద రెండు రోజుల దీక్షను చేపట్టిన విషయం తెలిసిందే. ఇక బిల్లును గట్టిగా వ్యతిరేకించాలని భావిస్తున్న కాంగ్రెస్ పార్టీ కూడా ఢిల్లీలో మెగా ర్యాలీని, ఆపై జంతర్ మంతర్ వద్ద నిరసనను తెలపాలని తీర్మానించింది. అంతేకాదు అన్నా హజారే చూపిన బాటలో నడచి ఆయనలాగే శాంతి పద్ధతిలో ఉద్యమించాలని ఫ్లాన్ వేసుకుందని తెలుస్తోంది. ర్యాలీలో సీనియర్ నేతలు దిగ్విజయ్ సింగ్, జైరాం రమేష్, సల్మాన్ ఖుర్షీద్ తదితరులు పాల్గొంటారని తెలుస్తోంది. చట్ట సభల్లో చర్చ జరగకుండా ఆర్డినెన్సుల ద్వారా బిల్లుల ఆమోదాన్ని ఎంతమాత్రం ఒప్పకోరాదని గట్టిగా పట్టుబడుతోందని సమాచారం. ఈ నేపథ్యంలోనే బిల్లు వ్యతిరేక ర్యాలీని విజయవంతం చేసి తిరిగి ఫాంలోకి రావాలని తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్లుంది. చేస్తే చేస్తున్నారు గానీ బాసూ మధ్యలో పెద్దాయనను లాగటం ఎందుకో?. సింపథీ కోసం అయితే కష్టమే సుమీ!