వాళ్లే పోయారుగా... ఇంక ఫోటోలెందుకని!

July 04, 2015 | 05:12 PM | 5 Views
ప్రింట్ కామెంట్
KK_botsa_DS_photos_in_dustbin_gandhibhavan_VH_niharonline

సీనియర్లంతా తమకు నచ్చిన పార్టీల్లో చేరుతుండటంతో ఇరు రాష్ట్రాలలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి మరీ దారుణంగా మారింది. అసలే అంతంత మాత్రంగా ఉన్న పార్టీ ఉనికి ఇక జంప్ లతో పూర్తిగా కోల్పోయే పరిస్థితికి చేరుకుంది. తాజాగా మాజీ పీసీసీ చీఫ్ బోత్స సత్యనారాయణ ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్షం వైఎస్సార్సీపీ లో చేరిన విషయం తెలిసిందే. తెలంగాణ మరో మాజీ చీఫ్ కే.కేశవరావు ఎన్నికల ముందే గులాబీకి చేరుకుని అక్కడ అగ్రనేతగా చెలామణి అవుతుండగా, తాజాగా మరో చీఫ్ డీ.శ్రీనివాస్ (డీఎస్) పార్టీ మారేందుకు రంగం సిద్ధం చేసుకున్న విషయం తెలిసిందే. ఇప్పటికే రాజీనామా లేఖ సమర్పించిన ఆయన ఇప్పుడు గులాబీ తీర్థం పుచ్చుకునే ముహుర్తం కోసం ఎదురు చూస్తున్నారు. ఇక ఎందుకు అనుకుందో ఏమో కాంగ్రెస్ కూడా వారి ఆనవాలు పార్టీలో ఉండకూడదని డిసైడ్ అయ్యింది. ఈ మేరకు గాంధీభవన్ లోని కేకే, బొత్స సత్యనారాయణ, డీఎస్ ల ఫోటోలను తొలగించింది. ఈ క్రమంలో సీనియర్ వీహెచ్ ఆయా నేతల ఫోటోలను తొలగించి చెత్తబుట్టలో పడవేయించారు. వారంతా తమ స్వలాభం కోసం పార్టీ వీడారు. ఇంకా వారి జ్ఞాపకాలేవి ఇక్కడ ఉండకూడదు అని వీహెచ్ ఆగ్రహాంతో చెప్పారు. అందరు వీహెచ్ లా స్వామి భక్తితో ఉండలేరుగా...

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ