బాబు భజన ఆపుండ్రా బయ్

October 12, 2015 | 05:41 PM | 3 Views
ప్రింట్ కామెంట్
congress-V-hanumantha-rao-suggest-AP-leaders-special-status-niharonline

ఏపీ ప్రత్యేక హోదా అంశం అక్కడి నేతలనే కాదు, తెలంగాణ నేతలను కూడా కదిలించివేస్తుంది. ఇక్కడి అన్ని పక్షాలు ఏపీ కి ప్రత్యేక హోదా రావాలని కొరుకుంటున్నట్లు మద్ధతు ప్రకటించటం విశేషం. అధికార టీఆర్ఎస్ కూడా అందుకు మినహాయింపు కాకపోవటం విశేషం. రాజధాని, సౌకర్యాలు లేక పాలన అస్తవ్యస్తంగా ఉండాలని ముఖ్యంగా తెలంగాణ కాంగ్రెస్ నేతలంతా రోజుకోకరు మద్ధతు ప్రకటిస్తుండగా, ఇప్పుడు సీనియర్ నేత వీహెచ్ వంతు వచ్చింది.

అయితే ఆయన అందరిలా కాకుండా కాస్త భిన్నంగా స్పందించారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకి భజన చేయడం మాని, రాష్ట్రానికి ప్రత్యేకహోదా తీసుకొచ్చే దిశగా ప్రయత్నించాలని కేంద్రంలోని ఏపీ నేతలకు ఆయన సూచిస్తున్నారు. ముఖ్యంగా  కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు చొరవ తీసుకుని ప్రత్యేక హోదా కోసం కృషి చేయాలని ఆయన సూచించారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, జగన్ కు హామీ ఇచ్చి దీక్ష విరమింపచేయాలని ఆయన సూచించారు. జగన్ ఆరోగ్యం దెబ్బతింటే భవిష్యత్ లో బాధపడాల్సి వస్తుందని, అలాగే కేంద్ర ప్రభుత్వం ఆర్ఎస్ఎస్ కనుసన్నల్లో నడుస్తోందని ఆయన ఆరోపించారు. ఆర్ఎస్ఎస్ ఏది చేబితే ఎన్డీయే అది చేస్తుందని ఆయన విమర్శించారు. రిజర్వేషన్లపై ఎన్డీయే ఆర్ఎస్ఎస్ విధానాన్ని అనుసరిస్తోందని ఆయన ఆరోపించారు.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ