జగన్ కు పోటీగా నారా లోకేశ్ దీక్ష??

October 12, 2015 | 03:38 PM | 1 Views
ప్రింట్ కామెంట్
jagan-fasting-AP-special-status-lokesh-niharonline

ఆంధ్రప్రదేశ్ ని అన్యాయంగా విభజించారని, ఇప్పుడు కూడా మోసపూరిత పాలనను కొనసాగిస్తూ జనాల్ని మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపిస్తూ ప్రతిపక్ష నేత జగన్ దీక్ష చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రత్యేక హోదా సాధన దిశగా తన దీక్ష ఉండబోతుందని వేదిక సాక్షిగా ప్రకటించాడాయన. అయితే ఐదు రోజులుగా కొనసాగుతున్న ఈ దీక్షపై మంత్రుల అనుచిత కామెంట్లు ఇప్పుడు వార్తల్లో నిలిచాయి. జగన్ దీక్షపై అనుమానాలున్నాయనీ, కీటోన్స్‌, షుగర్‌ లెవల్స్‌ విషయంలో పొంతనలేని 'వైద్య పరీక్షా ఫలితాలు' వెలుగు చూస్తున్నాయంటూ ప్రతిపాటి, కామినేని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.

ప్రత్యేక హోదాకై వైఎస్ జగన్ చేస్తున్నది దొంగ దీక్షంటూ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు చేసిన చేసిన వ్యాఖ్యలను వైఎస్ఆర్ కాంగ్రెస్ కాకినాడ నేత ద్వారంపూడి చంద్రశేఖర్ ఖండించారు. తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో ఇవాళ జగన్ దీక్షకు మద్దతుగా చంద్రశేఖర్ ఆధ్వర్యంలో ఐదో రోజు రిలే దీక్ష జరిగింది. ఈ వేదికలో ద్వారంపూడి మంత్రులపై విరుచుకుపడ్డారు. గతంలో చంద్రబాబు చేసినవే దొంగ దీక్షలని ఎద్దేవా చేశారు. అందుకే అందరినీ దొంగ బుద్ధితో చూస్తున్నారన్నారు. గతంలో దీక్ష చేసే టైంలో బాబు షుగర్, బీపీలు ఎందుకు డౌన్ కాలేదని ద్వారంపూడి ప్రశ్నించారు. దమ్ముంటే జగన్ తో సమానంగా ఆయన కుమారుడు లోకేశ్ తో దీక్ష చేయించాలని సవాల్ విసిరారు. అప్పుడు అసలు విషయం బోధపడుతుందని ఎద్దేవా చేశారు.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ