పేరు కాదు ప్రస్తావన వచ్చినా రాజీనామేనా?

July 29, 2015 | 12:24 PM | 4 Views
ప్రింట్ కామెంట్
congress_JD_seelam_chandrababu_naidu_cash_for_vote_niharonline

ఓటుకు నోటు కేసులో తెలంగాణ ఏసీబీ మంగళవారం చార్జిషీట్ దాఖలు చేసింది. ప్రధాన నిందితుడు కొడంగల్ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డితోసహా మిగతా నిందితుల పేర్లను ఏసీబీ షీట్ లో పేర్కొంది. అయితే ఇక్కడ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేరును ఏసీబీ ప్రస్తావనకు తేవడం ఇప్పుడు చర్చకు దారితీస్తోంది. వీడియో టేపుల్లో రేవంత్ పలుమార్లు బాస్ అని, బాబు అని ప్రస్తావించారని , అవి చంద్రబాబును ఉద్దేశించేనట్లే అని నిర్థారించి ఏసీబీ చార్జిషీట్ లో పేర్కొందని కధనం. అంతేకాక తెలంగాణ నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్ సన్ తో చంద్రబాబు ఆడియో టేపుల ఆధారంగా బాస్ అంటే బాబే అన్న విషయాన్ని పరిగణనలోకి తీసునే ఆయన పేరును ప్రస్తావనకు తెచ్చినట్లు తెలుస్తోంది. ఇక దీనిని ఆసరాగా చేసుకున్న కాంగ్రెస్ ఆరోపణలకు దిగింది. చార్జ్ షీట్ లో చంద్రబాబు పేరు ప్రస్తావన వచ్చింది కాబట్టి అయిన ఖచ్ఛితంగా రాజీనామా చేయాల్సిందే అంటున్నారు కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు జేడీ శీలం. ఆడియో టేపుల్లో ఉన్నది తన గొంతు కాదని కూడా ఇంతవరకు చంద్రబాబు కూడా చెప్పలేదన్నదే ఆయన వాదన. అంతేకాదు రేవంత్ రెడ్డి తప్పు చేయలేదని కూడా బాబు ఎక్కడా మాట్లాడలేదని జేడీ గుర్తు చేస్తున్నారు. ఎదురు దాడిని తప్పించుకోడానికే అన్నట్లు చంద్రబాబు వ్యూహం ఉంది తప్ప నిజాయితిని ఎక్కడా ప్రదర్శించలేదని విమర్శించారు. ఒకవేళ చంద్రబాబు నీతిమంతుడిగా బయటకు వస్తే అప్పుడు తిరిగి పదవి చేపట్టవచ్చునని శీలం చెబుతున్నారు. అయితే ప్రస్తావనకు వచ్చిందే తప్ప, పేరును చార్జీషీట్ లో చేర్చలేదని తమ్ముళ్లు జేడీ కామెంట్లను లైట్ తీస్కుంటున్నారు.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ