కాంగ్రెస్ పరిస్థితి మరీ ఇంత దిగజారిందా?

May 06, 2016 | 11:19 AM | 1 Views
ప్రింట్ కామెంట్
sonia-rahul-save-democracy-niharonline

యూపీఏ రెండు మార్లు పాలనను పక్కన పెడితే వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న పార్టీ కాంగ్రెస్. గ్రాండ్ ఓల్డ్ పార్టీ ఆఫ్ ఇండియాగా చరిత్రలో నిలిచిన కాంగ్రెస్ వరుస కుంభకోణాలతో హీన స్థితికి చేరిపోయింది. ఫలితం ప్రతిపక్ష హోదా కూడా దక్కనీయకుండా  ప్రజలు దించేశారు. అయితే దేశాన్ని సుదీర్ఘ కాలం పాటు పాలించిన.. సీనియర్ నేతలు ఉన్నా... ఆ పార్టీకి ఆందోళనల చేపట్టే విషయంలో మాత్రం పెద్దగా అనుభవం లేదనే చెప్పాలి. అధికార బీజేపీ దయాదాక్షిణ్యంతో ప్రస్తుతం విపక్షంలో కూర్చున్న ఆ పార్టీకి అధికార పక్షాన్ని ఎదుర్కునే సామర్థ్యం రావటం లేదు. ఆఖరికి అగస్టా వెస్ట్ ల్యాండ్ కుంభకోణం వంకతో అధికార పక్షమే కాంగ్రెస్ పై దాడి చేస్తుంది. ఈ క్రమంలో ప్రాంతీయ పార్టీలు అనుసరిస్తున్న ఉద్యమ రీతులను ఆ పార్టీ కాపీ కొట్టేస్తోంది.

తాజాగా ఏపీ ప్రతిపక్ష అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ‘సేవ్ డెమోక్రసీ’ పేరిట సరికొత్త తరహాలో ఉద్యమానికి శ్రీకారం చుట్టారు. తన పార్టీ టికెట్ తో గెలిచి ప్రస్తుతం టీడీపీలోకి జంప్ అవుతున్నవారిని అనర్హులుగా ప్రకటించాలని, ప్రజాస్వామ్యాన్ని కాపాడాలంటూ ఢిల్లీ వెళ్లి మరీ ఉద్యమించారు. జగన్ చేసిన ‘సేవ్ డెమోక్రసీ’ ఉద్యమంపై నేషనల్ మీడియా బాగానే ప్రచారం చేసింది.

                                        దీంతో ఇప్పుడు కాంగ్రెస్ కూడా వైసీపీ బాటలోనే నడిచేందుకు సిద్ధమైంది. శుక్రవారం ఢిల్లీలోని జంతర్ మంతర్ దగ్గర ‘సేవ్ డెమోక్రసీ’ పేరిట కాంగ్రెస్ పార్టీ భారీ నిరసనను చేపట్టనుంది. ఈ ర్యాలీలో పార్టీ అధినేత్రి సోనియా గాంధీ, పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ తదిరులతో పాటు ఆ పార్టీ ఎంపీలు, పెద్ద సంఖ్యలో నేతలు హాజరు కానున్నారు. వందల ఏళ్ల చరిత్ర ఉన్న కాంగ్రెస్ కి ఉద్యమాలు ఎలా చేయాలో కూడా తెలీక ఇలా ప్రాంతీయ పార్టీల తీరుదెన్నులను ఫాలో అయిపోవటం మరీ దారుణం.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ