ఆ విషయంలో కమలానికి కాంగ్రెస్ టఫ్ కండిషన్లు

July 01, 2015 | 05:39 PM | 3 Views
ప్రింట్ కామెంట్
congress_put_conditions_to_bjp_niharonline

భూసేకరణ బిల్లుతో సహా పార్లమెంటులో ప్రవేశపెట్టబోయే అన్ని బిల్లులకు బీజేపీ ప్రభుత్వానికి మద్ధతిచ్చే అంశంపై కాంగ్రెస్ ఓ అడుగు వెనక్కు వేసినట్లు తెలుస్తోంది. పార్లమెంటులో బిల్లులు పాస్ కావటానికి సహకరిస్తాం కానీ, అందుకు బీజేపీ ఓ పని చేయాలని నిబంధన విధించిందట. కేంద్ర మంత్రి అయిన సుష్మాస్వరాజ్, రాజస్థాన్ ముఖ్యమంత్రి వసుంధర రాజేలను పదవుల నుంచి తొలగిస్తే తప్పకుండా సహకరిస్తామని రాయబారం పంపిందట. నిజానికి పార్లమెంటు ఉభయసభల్లో బీజేపీ కి లోక్ సభలో పూర్తిస్థాయి మద్ధతు ఉంది. కానీ, రాజ్యసభలో బిల్లు పాస్ కావాలంటే కాంగ్రెస్ మద్ధతు తప్పనిసరిగా అవసరం ఉంటుంది. దీంతో ఎలాగైనా బీజేపీని ఇరకాటంలో పెట్టేందుకు ఇలాంటి ప్రతిపాదనను తెరపైకి తెచ్చిందట. ఈ వర్షాకాల సమావేశాల్లోనే భూ సేకరణ బిల్లును ప్రవేశపెట్టాలని బీజేపీ భావించినప్పటికీ మహిళా మంత్రుల వ్యవహారంతో ఆ ఆలోచనను విరమించుకుంది. కీలకమైన మహిళా నేతల రాజీనామా రాజకీయంగా పార్టీకి పెద్ద దెబ్బగా భావిస్తున్న మోదీ ఈ విషయంలో ఎలాంటి చర్యలకు పూనుకునే పరిస్థితి మాత్రం కనబడటం లేదు.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ