భారతదేశపు చరిత్రలో స్వర్ణయుగం ఎన్నడు గలదు? అట్టి వైభవం తాలూకు వివరాలు ఎవరు వివరిస్తారు? మేనక, విశ్వమిత్రుడు, భరతుడు... చరిత్రాంశాలు గతంలోకి జారుకున్న తర్వాత బ్రిటీష్ వారి పీడనాపర్వం, స్వతంత్ర్య పోరాటం, బోసు, భగత్ సింగుల త్యాగనీరతి ఇక అప్పటి నుంచి మొదలైన స్వయంపాలన, రిపబ్లిక్ గా అవతరించటం! ఒక ప్రధాని, ఒక రాష్ట్రపతి, ముఖ్యమంత్రులు, గవర్నర్లు ఆరోహణ క్రమంలో పంచాయితీ సర్పంచుల నుంచి పాలన,... ఈ చట్రంలో నిర్దేశిత అర్హతలతో కీలక బాధ్యతలు నిర్వర్తించే ఐఏఎస్ లు, ఈ విహంగ వీక్షణం పూర్తి అయిందనుకుందాం. బిగింపుగా ఏర్పడ్డ పాలనాచట్రంలో ఏ లోపాలు లేనంత వరకు సాఫీగా నడిచిపోతుంది. జురాసిక్ పార్కులాంటి ఈ అండపిండ బ్రహ్మాండాన్ని కీలుబొమ్మలా ఆడించే రాజకీయాలు, సిసలైన పాలనా యంత్రాగాన్ని చిటికిన వ్రేలుతో శాసించే రాజకీయ నాయకులు గల అర్హత. అనుభవం ఏదైనా నిర్దిష్టంగా నిర్వచించబడిందా? శ్రీమాన్ నాయకమన్యులకు గల విద్యార్హతలు చెప్పగలరా? ఇట్టి మేధోమధనానికి గురైన ఒక అర్భకుడు ఏకంగా ప్రధాని మోదీ విద్యార్హతల మీద బెంగపెట్టుకున్నాడు. దానికి సమాచార హక్కు, పీఎంవో ఆఫీసు వగైరాలను ఆశ్రయించేడు. ఎన్నికల సందర్భంగా మోదీ తాను ఎంఏ చదుకున్నానని సమర్పించిన తాఖీదు చూపించగలందులకు కోరి ప్రార్థించేడు, ఫలితం శూన్యం. అయినా భ్రమగానీ ఎన్నిక వేలిముద్రలు మనల్ని పరిపాలించలేదు? ఓంశాంతి శాంతి: