అమాయకుడు వచ్చింది కేసీఆర్ కళ్లు తెరిపించేందుకేనా?

May 16, 2015 | 07:42 PM | 44 Views
ప్రింట్ కామెంట్
VHR_fires_on_kcr_niharonline.JPG

కిసాన్ సందేశ్ యాత్ర పేరిట కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ తెలంగాణలో శుక్రవారం పాదయాత్ర చేసిన విషయం తెలిసిందే. అయితే దీనిని వివిధ రాజకీయ పక్షాల నుంచి రకరకాల కామెంట్లు వినిపిస్తున్నాయి. ఇప్పటికే రాహుల్ ను తెలంగాణ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అమాయకుడిగా అభివర్ణించారు. అయితే దీనిపై కాంగ్రెస్ సీనియర్ నేత వీ.హన్మంతరావు ఘాటుగా వ్యాఖ్యానించారు. తెలంగాణ సీఎం కేసీఆర్ కళ్లు తెరిపించేందుకే రాహుల్ ఇక్కడ పాదయాత్ర చేశారని వీహెచ్ కౌంటర్ వేశారు. రైతుల ఆత్మహత్యలపై ఇంతవరకు స్పందించకుండా ముఖ్యమంత్రి ఆలసత్వం ప్రదర్శిస్తున్నారని, అందుకే కనీసం రాహుల్ పర్యటనతోనైనా కళ్లు తెరవాలని ఆయన కేసీఆర్ కు చురకలంటించారు.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ