సారీ చెప్పినా... సీఎంను కోర్టుకు లాగాడు

August 01, 2015 | 10:58 AM | 2 Views
ప్రింట్ కామెంట్
constable_defamation_against_arvind_kejriwal_niharonline

ఓ వైపు రాజకీయ సమస్యలతో అల్లలాడుతున్న ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కు ఇప్పుడు వ్యక్తిగతంగా కూడా సమస్యలు చుట్టుముట్టబోతున్నాయి. ఓ కానిస్టేబులో ఏకంగా ఆయనపై పరువునష్టం దావానే వేసిపాడేశాడు. ఢిల్లీ మెట్రోపాలిటన్ కోర్టు కూడా శుక్రవారం ఈ దావాను విచారణకు స్వీకరించింది. వారం క్రితం ఓ టీవీ చానెల్ కిచ్చిన ఇంటర్వ్యూలో కేజ్రీవాల్ మాట్లాడుతూ... ఢిల్లీ పోలీసులను ‘తుల్లా’ గా అభివర్ణించారు. తుల్లా అంటే లంచగొండులని... పేద జనాల్ని, వీధి బిచ్ఛగాళ్లని డబ్బు కోసం ఢిల్లీ పోలీసులు తీవ్రంగా వేధిస్తారని ఆయన కామెంట్లు చేశారు. దీనిపై విమర్శలు రావటంతో క్షమాపణలు కూడా చెప్పారు. నిజాయితీపరులైన వారు తన మాటలకు గాయపడి ఉంటే మన్నించాలని ఆయన తర్వాత స్టేట్ మెంట్ ఇచ్చారు. అయితే హర్విందర్ అనే కానిస్టేబుల్ మాత్రం ఈ విషయమై కోర్టును ఆశ్రయించాడు. దీంతో కోర్టు పిటిషన్ ను విచారణకు స్వీకరించిన తగిన సాక్ష్యాలతో రావాల్సిందిగా హర్విందర్ ను ఆదేశించింది.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ