క్షమాపణాస్త్రం ఉండగా ఏం తప్పులేదు!

July 31, 2015 | 04:40 PM | 3 Views
ప్రింట్ కామెంట్
jagga_reddy_back_to_congress_niharonline

కాంగ్రెసులో ఉన్న సీనియారిటీని విస్మరించి అనుకోని పరిస్థితుల్లో బీజేపీ లో చేరడం పొరపాటే! అని తూర్పు జగ్గారెడ్డి నేరాంగీకరణ ప్రకటన చేశారు. జగ్గారెడ్డిలాంటి ప్రజానాయకులకు ఏ పార్టీ ముద్రా అవసరం లేదు. ఆయన ఇంటి ముందు ఉదయాన్నే జనం బారులు తీరి రకరకాల విజ్నాపన పత్రాలతో వేచి ఉండటం నియోజకవర్గంలో అందరికీ తెలుసు. తక్షణమే స్పందించి సమస్యల పరిష్కారానికై ఆయన తాపత్రయపడతాడు. ఇన్ని శుభలక్షణాలున్న ప్రజానాయకుడు పార్టీ దూకడం, అపార్థం చేసుకోకూడదు. జాతీయ అధికార పార్టీ బీజేపీలోకి మారడమంటే తన ప్రజలకు కేంద్ర స్థాయిలో ఉపకరించాలనే... అలా ఎగిరి, ఎగిరి, ఎదిగి, ఎదిగి తారాస్థాయికి చేరి అందరి మన్ననలందుకోవచ్చని ఆలోచన అయి ఉంటుంది. గడ్డం, తలకట్టు కూడా కాషాయ పార్టీ పట్ల ఆకర్షణ పెంచి ఉండవచ్చు. కానీ, బీజేపీ టిక్కెట్టు లాభించలేదు. తత్వం బోధపడింది. టీఆర్ఎస్ ఏమంటుందో తెలియదు. తెలంగాణ ఇచ్చిందీ, తెచ్చిందీ మేమే అంటున్న కాంగ్రెస్ ఒళ్లో కుంచెం వెచ్చగా ఉంటుందనే కించిత్ భ్రమ... చిత్త భ్రమ! ప్రస్తుతం క్రాపు వేయించుకుని, గడ్డం ట్రిమ్ చేయించి కొత్త పెళ్ళి కొడుకులా మెరిసిపోతున్నాడు జగ్గయ్య!

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ