సినిమాల ప్రభావం సీపీఐకి కూడా పాకిందే!

July 20, 2015 | 05:32 PM | 5 Views
ప్రింట్ కామెంట్
cpi_narayana_protests_in_kalikeya_getup_niharonline

బాహుబలి ఫీవర్  ఓ వైపు దేశం మొత్తాన్ని ఊపేస్తుంటే ఆసక్తికరంగా ఇప్పుడు ఆ గాలి రాజకీయాలపైకి కూడా మళ్లీనట్లుంది. ప్రజా సమస్యలంటూ ఎప్పుడూ నిరసనలు చేపట్టే సీపీఐ పై కూడా ఆ ఎఫెక్ట్ పడిందట. ఆందోళనలకు పెట్టింది పేరైన ఆ పార్టీ బాహుబలి ట్రెండును ఫాలో అయ్యింది. కేంద్రంలో అవినీతి మంత్రులను వెంటనే తొలగించాలని హైదరాబాదులో వామపక్షాలు సుందరయ్య పార్క్ నుండి ఇందిరా పార్కు వరకు నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా బాహుబలి సినిమాలోని కాళికేయ వేషధారణలో వారు నిరసన తెలిపారు. సాధారణంగా వామపక్షాల నిరసనలను పట్టించుకోని ప్రజలు ఇలా సినిమా వేషధారణతో వారు కనిపించేసరికి ఆసక్తిగా తిలకించారు. ర్యాలీ సందర్భంగా సీపీఐ నేత నారాయణ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వాన్ని తీవ్రస్థాయిలో విమర్శించారు. కేంద్రం పూర్తిగా అవినీతి రొంపిలో కూరుకుపోయిందని అన్నారు. మధ్యప్రదేశ్ రాజస్థాన్ ముఖ్యమంత్రులు ఎంతో అవినీతికి పాల్పడ్డారని వారు వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. కేంద్ర మంత్రులు కూడా అలాంటి బాటలోనే కొనసాగారని వారు చేసిన అవినీతికి బాధ్యత వహించి వెంటనే రాజీనామాలు చేసి పదవి నుంచి తప్పుకోవాలని డిమాండ్ చేశారు. సాధారణంగా ఎర్రజెండాలు, దిష్టిబొమ్మల దహనాలు, నినాదాలకే పరిమితమయిన వీరు ఈసారికి మాత్రం ఇలా భిన్నంగా కామ్రేడ్ కాళికేయులుగా అలరించటంతో  ఆటుగా వెళ్తున్నవారంతా ఆగి మరీ చూశారుట. ఫ్యూఛర్ లో కూడా వీరు ఇలా మరిన్నీ ట్రెండ్ లను ఫాలో  అయి క్రేజ్ సంపాదించుకోవాలని ఆశిద్ధాం.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ