గురువుగారి దండయాత్రకు మద్దతిచ్చిన శిష్యుడు

February 24, 2015 | 05:27 PM | 61 Views
ప్రింట్ కామెంట్
kejriwal-hazare_at_janthar_manthar_niharonline

కేంద్రం తెచ్చిన భూసేకరణ చట్టానికి వ్యతిరేకిస్తూ ప్రముఖ గాంధేయవాది అన్నాహజారే రెండు రోజుల దీక్ష చేపట్టిన విషయం తెలిసిందే. దీనికి ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ హాజరై మద్ధతు ప్రకటించాడు. దేశ రాజధాని సీఎం హోదాలో ఉండి కూడా ఓ సాధారణ నిరసనకారుడిలా ఆయన దీక్షకు కూర్చున్నాడు. మంగళవారం మధ్యాహ్నం జంతర్ మంతర్ వద్ద గల దీక్షాశిబిరంకు చేరుకున్న ఆయన ఒకప్పటి గురువు, మార్గదర్శి అయిన హజారేను ఆప్యాయంగా పలకరించి పక్కన కూర్చున్నారు. కేజ్రీవాల్ తోపాటు ఆయన మొత్తం 66 మంది ఎమ్మల్యేలు, ఇంకా ఆప్ కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొని తమ సంఘీబావం తెలిపారు . ఇక దీక్షా శిబిరంలో కేజ్రీవాల్ మాట్లాడుతూ... భూసేకరణ చట్టానికి తాము వ్యతిరేకమని, దీనివల్ల రైతులకు మేలు జరగకపోగా, కష్టాలు పెరుగుతాయని ఆయన అన్నారు. అంతకుముందు దీక్షను ప్రారంభించిన హజారే మాట్లాడుతూ... ఇకపై ఆమరణ దీక్షలు ఉండబోవు. సాధించాలనుకున్నది బ్రతికి సాధిస్తాను అని ప్రకటించారు. రాబోయే నాలుగు నెలలు బిల్లుకు వ్యతిరేకంగా ప్రభుత్వంపై దండయాత్ర చేసి తీరుతానని హజారే ప్రకటించారు.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ