భేషుగ్గానే ఉన్నప్పటికీ దద్దరిల్లటం మాత్రం ఖాయం

February 24, 2015 | 11:38 AM | 30 Views
ప్రింట్ కామెంట్
parliament_land_acquisation_act_niahronline

భూసేకరణ బిల్లుపై చర్చ సందర్భంగా పార్లమెంట్ ఉభయసభలు వేడెక్కే పరిస్థితులు దాదాపు కనిపిస్తున్నాయి. ఓ వైపు బిల్లుకు చేసిన సవరణలపై విపక్షాలతోపాటు సామాజిక ఉద్యమకర్త అన్నా హాజరే ప్రధాని మోదీపై యుద్ధం ప్రకటించగా, మరోవైపు ఎట్టి పరిస్థితుల్లో వెనక్కి తగ్గేది లేదంటూ బీజేపీ ప్రకటించింది. ముందుగా మంగళవారం సమావేశాల ముందుగా బీజేపీ పార్లమెంటరీ బోర్డు సమావేశం జరిగింది. ఈ సందర్భంగా మోదీ వారితో సభలో అనుసరించాల్సిన వైఖరిపై సభ్యులకు దిశానిర్ధేశం చేశారు. ఈ సందర్భంగా ఆయన బిల్లు భేషుగ్గానే ఉంది. వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని సభ్యులతో ప్రకటించారట. విపక్షాలు ఏరేంజ్ లో విరుచుకుపడ్డా దానిని ఎలా ఎదుర్కొవాలో, కౌంటర్లు ఎలా వేయాలో సన్నద్ధం కావాలని ఆయన వారికి సూచించినట్లు తెలుస్తోంది. ఎలాగైనా సరే ఈరోజు(మంగళవారం) బిల్లును లోక్ సభలో ప్రవేశపెట్టాలని ప్రధాని మోదీ భావిస్తున్నారు. ఇక విపక్షాలు కూడా తమ తమ ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నాయట. ఇక తాజా సమాచారం ప్రకారం రాజ్యసభలో దీనిపై రచ్చ మొదలైందట. ప్రజా ప్రయోజనం కోసం తెచ్చిన ఆర్డినెన్స్ కు బీజేపీ సవరణలు చేసి తప్పుచేస్తుందని. దీని ద్వారా పారిశ్రామికవేత్తలకు తప్ప ఎవరికీ లాభం ఉండబోదని కాంగ్రెస్ నేత ఆనంద్ శర్మ ఆరోపించారు. తక్షణమే చర్చ చేపట్టాల్సిందిగా ఆయన స్పీకర్ ను కోరారు. దీనిపై స్పందించిన ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ఈ వ్యాఖ్యలను ఖండించారు. ఏదేమైనా బిల్లు ఎలా ఉన్నప్పటికీ ఉభయసభలు గందరగోళంతో దద్దరిల్లటం మాత్రం ఖాయం.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ