ఇప్పుడు ఇంకోటి: తప్పుడు సర్టిఫికెట్ల కేసులో ఆప్ మంత్రి అరెస్ట్

June 09, 2015 | 12:51 PM | 1 Views
ప్రింట్ కామెంట్
AAP_minister_jitendra_singh_tomar_niharonline

ఆప్ కు మరో  పెద్ద దెబ్బ పడింది. తప్పుడు ధ్రువపత్రాలను సమర్పించిన కేసులో ఆమ్ ఆద్మీ పార్టీ నేత, ఢిల్లీ న్యాయ శాఖ మంత్రి జితేంద్ర సింగ్ తోమర్ ను మంగళవారం పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ సంవత్సరం ఫిబ్రవరిలో ఢిల్లీ ఎన్నికలకు నామినేషన్ వేసే సమయంలో విద్యార్హతలకు సంబంధించి తప్పుడు సమాచారం ఇచ్చారన్నది తోమర్ పై ప్రధాన ఆరోపణ. ఓ యూనివర్సిటీ నుంచి తాను న్యాయపట్టాను పొందానన్నది అప్పట్లో ఆయన దాఖలు చేసిన అఫిడవిట్ లో పేర్కొన్నారు. ఆయన న్యాయశాస్త్రం చదవలేదనే ఆరోపణలు రావటంతో అసలు వ్యవహారం మొదలైంది. తోమర్ తప్పుడు పత్రాలను జతపరిచారని విచారణలో తేల్చిన పోలీసులు ఈ ఉదయం అదుపులోకి తీసుకున్నారు.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ