గంపెడాశ గాలిలో దీపమేనా? ప్రత్యేకహోదా ఫలించేనా?

February 28, 2015 | 11:06 AM | 46 Views
ప్రింట్ కామెంట్
AP_special_status_in_budget_niharonline

బీజేపీ ప్రభుత్వం వెలువరచనున్న తొలిబడ్జెట్ లో కేటాయింపులపై ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం గంపెడు ఆశలు పెట్టుకుంది. పెద్ద ఎత్తున నిధుల మంజూరు, భారీగా పన్ను రాయితీలు కల్పించే ప్రత్యేక హోదా వస్తుందని ఒకసారి, రాదని ఓసారి రాజకీయ నాయకులు ప్రజలను గందరగోళానికి గురిచేస్తున్నారు. కానీ, ప్రత్యేక హోదా అన్నది హుళక్కేనని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఎందుకంటే, విభజన చట్టంలో ప్రత్యేక హోదాపై స్ఫష్టమైన ప్రస్తావన లేనే లేదు. అప్పటి కేబినెట్ ఆమోదం మాత్రం ఉంది. ఒక వేళ ప్రత్యేక హోదా రాకపోతే... సౌకర్యాల కల్పనకు కేంద్రం నిధుల మంజూరు మాత్రమే చేస్తుంది. ఇతర కేటాయింపులు, రాయితీలు ఉండకపోవచ్చు. దీనినే పరోక్షంగా కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు కూడా ఆ మధ్య ప్రస్తావించాడు కూడా. ఇక 14వ ఆర్థిక సంఘం సిఫార్సుల ఆధారంగా నిధుల కేటాయింపు జరగనుంది. లోటు బడ్జెట్ ను ముందుగా భర్తీచేయాలని కమిషన్ సిఫార్సు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రత్యేక హోదా అంశం గాలిలో దీపం కానుంది. ఇకపోతే, రాష్ట్రాలకు ప్రత్యేక హోదా ఇవ్వటం 1969 నుంచి ప్రారంభమైంది. 5వ ఫైనాన్స్ కమిషన్ నివేదికను ఆధారం చేసుకుని అస్సాం, నాగాలాండ్, జమ్ముకశ్మీర్ రాష్ట్రాలకు ఈ హోదా కల్పించారు. అనంతరం అరుణాచల్ ప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్, మణిపూర్, మేఘాలయా, సిక్కిం, మిజోరాం, త్రిపుర రాష్ట్రాలకు కూడా వర్తింపజేశారు. ఎన్డీఏ హయాంలో ఏర్పడిన ఉత్తరాఖండ్ కు కూడా ప్రత్యేక హోదా ఇఛ్చేసింది. దీని ఆధారంగా ఎన్డీఏ ఇఫ్పుడు కూడా ఏపీకి ఇస్తుందేమోనని నేతలు ఆశలు పెట్టుకుంటున్నారు. ఈనేపథ్యంలో అన్నీ తీపి వార్తలే కాదు... చేదు గుళికలు కూడా ఉంటాయని ప్రధాని వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. అది బహుశా ఏపీ ప్రత్యేక హోదా నిరాకరణే అయి ఉంటుందని భావించాల్సి ఉంటుందేమో!

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ