ఐఫా(ఇంటర్నేషనల్ ఇండియన్ ఫిలిం ఫెస్టివల్ ) ఇన్నాళ్లు కేవలం బాలీవుడ్ కే పరిమితమైన అ అవార్డుల పంటను ఈసారి నుంచి సౌత్ లోనూ నిర్వహించాలని నిర్ణయించారు. దక్షిణాది చిత్రాలను దృష్టిలో ఉంచుకుని ఇక నుంచి ప్రతీయేడు ఇక్కడ కూడా ఈ వేడుకలు జరగనున్నాయి. ఇక మొదటి వేడుకలను కూడా హైదరాబాద్ లో నిర్వహించాలని ఫిక్సయ్యారు కూడా. సినీ తారల డాన్సుల నడుమ అంగరంగ వైభవంగా ఈ వేడుకను నిర్వహించేందుకు సిద్ధమయిపోతుండగా, అనుకొని అడ్డంకి ఇప్పుడు వచ్చిపడింది.
అది కూడా తెలంగాణ సీఎం కేసీఆర్ నుంచే కావటం విశేషం. ఈ నెల 4 నుంచి మూడు రోజుల పాటు నిర్వహించనున్న ఐఫా(ఇంటర్నేషనల్ ఇండియా ఫిల్మ్ అకాడమీ) అవార్డుల వేడుకలను వాయిదా వేయాలని సీఎం కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారు. అయితే దీనివెనుక రాజకీయ కారణాలు ఏవీ లేవు సుమా. ప్రస్తుతం తమిళనాడు రాజధాని చెన్నై సహా పలు ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షాలతో అస్తవ్యస్తంగా ఉండటంతోపాటు వందలాది మంది చనిపోయారు. ఇలాంటి సమయంలో వేడుకలు నిర్వహించడం భావ్యం కాదని ఆయన భావిస్తున్నారట. అందుకే వేడుకలను కొన్ని రోజులపాటు వాయిదా వేయాలని నిర్వహాకులను కోరారాట. అయితే తొలిసారిగా ఇక్కడ జరుగుతున్న వేడుకలపై నిర్వహకులు ఎలా స్పందిస్తారో మరి?